Translate

  • Latest News

    19, జూన్ 2020, శుక్రవారం

    చక్కనమ్మ చిక్కినా అందమే...


    చక్కనమ్మ చిక్కినా అందమే... అన్న సామెతను రుజువు చేసిందీ అమ్మడు... ముద్దుగా...బొద్దుగా ఉండే కీర్తి సురేష్ కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకుని తన శరీరంపై దృష్టి పెట్టి డైటింగ్ చేసి ఎవరూ ఊహించని విధంగా సన్నబడి నాజూగ్గా తయారయింది. దీంతో కీర్తి కి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే అవకాశం వచ్చి ఒళ్ళో పడింది. మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ బుక్ అయింది. ఇప్పటి దాకా బొద్దుగా ఉండి  అపర సావిత్రిలా మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న కీర్తి సురేష్ ఇకపై సన్నగా..నాజూగ్గా... తన నటనతో పాటు, గ్లామర్ ను కూడా జత చేసి భవిష్యత్తులో దక్షిణాది సినీ పరిశ్రమలో మరో శ్రీదేవి లా ఏలుతుందేమో... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చక్కనమ్మ చిక్కినా అందమే... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top