మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, సినీ నటుడు, నిర్మాత నాగబాబు గారాల పట్టి నీహారిక గుంటూరు కుర్రోడిని పెళ్లి చేసుకోబోతోంది. హైదరాబాద్ లో టెక్ మహీంద్రా లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్య అనే కుర్రాడు మెగా ఫ్యామిలీ ఇంటి అల్లుడు కాబోతున్నాడు. ఈ కుర్రోడు మరెవరో కాదండోయ్...
గుంటూరు లో ఐ.జి. (ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) గా పనిచేస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర రావు కుమారుడు. ప్రభాకర రావు సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్ ఐ.జి. గా ఈ ఏడాది మార్చి 7 న ఛార్జ్ తీసుకున్నారు. ఇటీవల తరచుగా నాగబాబు గుంటూరు పర్యటనల అంతరార్ధం ఇదన్న మాట... మొత్తానికి గోదావరి బుల్లెమ్మకి... గుంటూరు బుల్లోడికి కళ్యాణం ఫిక్స్ అయింది. నీహారిక హీరోయిన్ గా రెండు సినిమాలు చేసినా అవి ఫెయిల్ అయ్యాయి. జనం ఇక తనను హీరోయిన్ గా రిసీవ్ చేసుకోరని ఫిక్స్ అయిన నిహారిక పెళ్లి పీటలు ఎక్కుతోంది. తన కల ఎలాగో తీరలేదని.. తన ఫియాన్సీ ని హీరో ను చేసినా చేయొచ్చు. కుర్రోడు ప్రస్తుతానికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్నా చూపులకు బాగానే...అందంగానే కనపడుతున్నాడు కాబట్టి.. భవిష్యత్తులో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో గా అవతరించినా ఆశ్చర్యం లేదు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి