Translate

  • Latest News

    25, మార్చి 2018, ఆదివారం

    చంద్రబాబు బాధ రాష్ట్ర ప్రజలందరి బాధట..


    మహాప్రస్థానం పుస్తకానికి యోగ్యతా పత్రం  రాస్తూ చలం ఇలా అన్నాడు. కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ అని...  ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాలను చూస్తే ఈ వాక్యమే గుర్తు వస్తోంది. 
    చంద్రబాబు కు వచ్చిన కష్టం... రాష్ట్ర ప్రజలందరికీ వచ్చిన కష్టం అట.  ఆయన్ను బలహీనపరిస్తే... రాష్ట్రాన్నే బలహీన పరిచేందుకు జరుగుతున్న  కుట్ర అట. ఆయన పాలనను తప్పు పట్టడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించడం అట... వహ్వా...వహ్వా... ఏం సెలవిచ్చారు... నిన్నటి దాకా బి.జె.పీ వాళ్ళతో భుజాలు, భుజాలు రాసుకు పూసుకు తిరిగినప్పుడు వాళ్ళు దేవుళ్ళు... వాళ్లకు సన్మానాలు... ఇప్పుడు దొంగలు దొంగలు పంచుకునేకాడ ఎక్కడ చెడిందో ఏమో కానీ అకస్మాత్తుగా వాళ్ళు చెడ్డోళ్ళయి పోయారు. (చంద్రబాబు తోక పత్రిక ఆంధ్రజ్యోతి లో రాసినట్టు బి.జె.పీ వాళ్లు  వచ్చే ఎన్నికల్లో 10 ఎం.పీ, 50 అసెంబ్లీ సీట్లు అడిగారట. బాబు గారు కుదరదన్నారట.. అందుకే వ్యవహారం బెడిసికొట్టిందని ఆంధ్ర జ్యోతి చెప్పకనే చెప్పింది మరి).  ఇప్పుడు తనను తప్పు పడితే రాష్ట్రాన్నే అవమానపరిచినట్టు అంటూ కొత్త డ్రామాకు తెర లేపారు. మరి తహసీల్దార్ వనజాక్షిని మీ ఎం.ఎల్.ఏ కిందపడేసి లాగి ఈడ్చి కొట్టినప్పుడు రాష్ట్రంలో మహిళలు అందరిని అవమానపర్చినట్టు కాదా... ఏ.ఎన్.యూ లో రిషితేశ్వరిని వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసినప్పుడు రాష్ట్రంలో విద్యార్థినులు అందరిని అవమానించినట్టు కాదా. తమకు కనీస వేతనాల కోసం అందోళన చేసిన అంగన్వాడీలను, వివిధ శాఖలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులతో కొట్టించి, అరెస్ట్ చేయించినపుడు రాష్ట్రంలో  ఉద్యోగులందరినీ అవమానించినట్టు కాదా... మీకొస్తేనే కష్టం... ఎదటివాళ్లకు వస్తే నష్టం అన్నట్టు మాట్లాడితే ఎలా బాబు గారు. 
    ఓ వైపు జగన్ శ్రీ శ్రీ లా రాష్ట్రంలో అందరి బాధను తన బాధగా చేసుకుని పాదయాత్ర చేస్తుంటే... మీరు కృష్ణ శాస్త్రిలా మీ బాధ అందరి బాధగా చెబుతున్నారు.. మీ అనుకూల పత్రికలూ, చానళ్ల ద్వారా మీకు వచ్చిన కష్టాన్ని రాష్ట్ర ప్రజలకు వచ్చిన కష్టంగా బాకా కొడుతూ ప్రజలను మరోసారి మోసం చేద్దామని చూస్తున్నారు. ప్రజలకు ఇప్పుడు కావలసింది కృష్ణ శాస్త్రులు కాదు... శ్రీ శ్రీ లు... శ్రీ.శ్రీ లు కావాలి. ప్రజల బాధను తన బాధగా చేసుకుని ముందుండి నడిపించే రాజకీయ  శ్రీ శ్రీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్ లో వారు అలాంటి వ్యక్తిని చూస్తున్నారు. అందుకే ...ఆయనకు పాదయాత్రకు వెళ్లిన ప్రతి చోటా జనాలు స్వచందంగా వేలాదిమంది తరలివస్తున్నారు.  ఆ జనాల్ని చూసే మీకు ఉడుకుమోత్తనం. అందుకే సరికొత్త నాటకం ఆడుతున్నారు. ప్రజల్ని మీరు ఎల్ల కాలం మోసం చేయలేరు చంద్రబాబు గారు. గుర్తుపెట్టుకోండి. 
    ఇట్లు 
    సామాన్యుడు 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చంద్రబాబు బాధ రాష్ట్ర ప్రజలందరి బాధట.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top