Translate

  • Latest News

    22, మార్చి 2018, గురువారం

    చంద్రబాబు ను అష్టదిగ్బంధనం చేయనున్నబి.జె.పీ


    తమిళనాడులో రూ. 9 కోట్ల కొత్త నోట్లతో పట్టుబడిన శేఖర్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్ కు  సంబంధం ఉందని ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో త్వరలో ఆ కేసుకు సంబంధించి లోకేష్ ను  సి.బి.ఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పధకం ప్రకారం  ముందుగా పవన్ నోటితో లోకేష్ అవినీతి విషయం బి.జె.పీ ప్రజల్లోకి తీసుకెల్లింది. ఆ తర్వాత బి.జె.పీ ఎం.ఎల్.సి విష్ణుకుమార్ రాజు గళం విప్పారు. మరోవైపు  బి.జె.పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు  వంద ప్రశ్నలతో ఒక ప్రశ్నవళి సిద్ధం చేశారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు బి.జె.పీ పై చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా బె.జె.పీ దీనిని రూపొందించినట్టు తెలుస్తోంది. మరోవైపు పనిలో పనిగా బి.జె.పీ రాష్ట్ర అధ్యక్షుని మార్చి హరిబాబు స్థానంలో సోము వీర్రాజు ను నియమిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. టీ.డీ.పీ పై ఒంటి కాలిపై  లేచి విరుచుకుపడే వీర్రాజును అధ్యక్షుడుగా పెట్టి తెలుగుదేశంపై మరింత ఒత్తిడి పెంచనుంది.  ఎన్నికల లోపు లోకేష్ కేసు, చంద్రబాబు ఓటుకు నోట్ల కేసు ను కూడా బయటకు తీయడం ద్వారా చంద్రబాబును అష్ట దిగ్బంధనం చేయడానికి బి.జె.పీ సూపర్ ప్లాన్ రెడీ చేసిందని తెలుస్తోంది.
    అష్టదిగ్బంధనం ఇలా... 
    1.వంద ప్రశ్నలతో ప్రశ్నవళి. 
    2. రాష్ట్ర బి.జె.పీ అధ్యక్షునిగా హరిబాబు ని మార్చి సోము వీర్రాజు ను నియమించడం. 
    3.పోలవరం అవినీతి పై వాస్తవాలతో నివేదిక. 
    4. రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన నిధుల జాబితా విడుదల చేసి, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది... ఎంత దుర్వినియోగం చేసింది... నివేదిక విడుదల. 
    5. చంద్రబాబు ప్యాకేజి కి ఒప్పుకుని ఇప్పుడు యూ టర్న్ తిరగడంపై సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం. 
    6. చంద్రబాబు అక్రమంగా దోచిన సొమ్ము మళ్ళీమ్చిన   32 కంపెనీల జాబితా బయటపెట్టడం. 
    7. శేఖర్ రెడ్డితో లోకేష్ సంబంధాలపై సి.బి.ఐ తో విచారణ. 
    8. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ. 
    సో.. ఇక చంద్రబాబుకు ముందంతా కష్టకాలమే సుమా... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: చంద్రబాబు ను అష్టదిగ్బంధనం చేయనున్నబి.జె.పీ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top