Translate

  • Latest News

    2, ఆగస్టు 2021, సోమవారం

    సింధూ... ప్యారిస్ లో స్వర్ణమే లక్ష్యంగా సాగిపో

     


     రియో లో 2016లో జరిగిన ఒలింపిక్స్ లో బాడ్మింటన్ లో రజత పతకం సాధించిన మన అచ్చమైన ఆరణాల తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు ఈసారి టోక్యో ఒలింపిక్స్ లో అడుగు పెట్టగానే మనమంతా గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చేస్తుందనే ఆశలు పెట్టుకున్నాం... సహజంగా మనం ఒక హీరో హిట్ పిక్చర్ తర్వాత వచ్చే సినిమా మీద సూపర్..డూపర్ హిట్ అవ్వుద్దని ఆశలు పెట్టుకున్నట్టు... కానీ సెమి ఫైనల్స్ లో వరల్డ్ నంబర్ వన్  చైనా అమ్మాయి తెయ్.జూ. యింగ్  తగిలేసరికి మన అమ్మాయి కాస్త తత్తరపడి మ్యాచ్ పోగొట్టుకుంది. దీంతో కనీసం కాంస్యం అయినా దక్కించుకుని పరువు నిలబెట్టుకుంటుందా లేదా అని కంగారు పడ్డాం. అయితే...మనం కంగారుపడ్డాం కానీ... తను కంగారుపడలేదు. ఓటమి విజయానికి మెట్టు అనే సామెతను గుర్తు చేసుకుంది. రెట్టించిన ఉత్సాహంతో ఆడింది. మరో చైనా క్రీడాకారిణి హి.బింగ్.జియావో పై వరుస సెట్లలో (21-13, 21-15) గెలిచి కాంస్య పతకాన్ని మెడలో వేసుకుంది. అంతేకాదు...వరుసగా రెండు  ఒలింపిక్స్ లో పతకాలు గెలుచుకున్న ఒకే ఒక్క భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్ర కెక్కింది. పురుషుల్లో కూడా ఈ ఘనత సాధించింది రెజ్లర్ సుశీల్ కుమార్ ఒక్కడే... 

    మరో మూడేళ్ళలో ప్యారిస్ లో మళ్ళీ  ఒలింపిక్స్ జరగనున్నాయి. మన సింధూ కి ఇప్పుడు కేవలం 26 ఏళ్లే... ప్యారిస్ ఒలింపిక్స్  నాటికి 29 వస్తాయి... సింధూ మరో ఆరేడేళ్లు మంచి ఫిట్ నెస్ తో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు... సో... నెక్స్ట్ ఒలింపిక్స్ లో సింధూ లక్ష్యం స్వర్ణమే... ఇదే...కసితో... పట్టుదలతో కఠోర సాధన చేసి ఆడితే... ఈసారి స్వర్ణ పతకం సింధూ మెడలో గ్యారంటీ గా వచ్చి పడుతుంది. నిన్న కాంస్య పతకం గెలవగానే సింధూ అన్న మాటల్లోనే ఆ ధీమా ప్రస్ఫూటంగా కనపడింది... 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కు కూడా నేను సిద్ధం. అని ఎంతో ధీమా గా ప్రకటించింది. కాబట్టి ఈసారి సింధూ తప్పనిసరిగా స్వర్ణ పతకం సాధిస్తుంది. చరిత్ర సృష్టిస్తుంది. వరుసగా మూడు ఒలింపిక్స్ లో పతకాలు గెలిచి చరిత్ర తిరగ రాస్తుందని ప్రగాఢంగా విశ్వసిద్దాం. మన తెలుగు బిడ్డ... అంతర్జాతీయ యవనికపై తెలుగు వారి ఖ్యాతిని జగజ్జగేయమానంగా ఇనుమడింపచేస్తుందని ఆశిద్దాం...అందుకు కావాల్సిన నైతిక మద్దతే కాకుండా అన్ని రకాల మద్దతు మన ప్రభుత్వాలు ఇవ్వాలని కోరుదాం... 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సింధూ... ప్యారిస్ లో స్వర్ణమే లక్ష్యంగా సాగిపో Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top