చంద్రబాబు నోట పదే పదే వినిపించిన మాట విజన్ 2020 . సరిగా పాతికేళ్ల కిందట ఆయన మామ ఎన్ టీ ఆర్ నుంచి ముఖ్యమంత్రి కుర్చీ లాక్కుని మొట్టమొదటి సారి ముఖ్య మంత్రి అయినప్పుడే ఆయన బుర్రలో విజన్ 2020 కి బీజం పడింది. అప్పుడు అందరూ విజన్ 2020 అంటే.... రాజా చంద్రబాబులుం గారు పాతికేళ్ల పాటు ఈ తెలుగు సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించి ప్రపంచంలో నెంబర్ 1 గా మార్చివేస్తారని... అదే విజన్ 2020 ప్లాన్ అని అనుకున్నారు. అందుకు తగ్గట్టే అప్పటి బిల్డప్ ఉంది. జంట నగరాల్లో సైబరా బాద్ అనే మరో కొత్త నగరాన్ని నిర్మించేశారు. హై టెక్ సిటీ ని కట్టేశారు. బుష్ ని, బిల్ గేట్స్ ని తన వద్దకే రప్పించు కున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ అనేది భారత దేశం లో ఒక రాష్ట్రం కాదు... ఒక ప్రత్యేక దేశం అన్నట్టుగా... బిల్డప్ ఉండేది. చంద్రబాబు లెవిల్ అంతర్ జాతీయ స్థాయి తప్ప ఆఫ్ట్రాల్ రాష్ట్రం, దేశం ఆయన స్థాయికి చాలా తక్కువ అన్నట్టుగా ఉండేది. ప్రపంచానికే బాబు గారు డైరెక్షన్ ఇస్తారన్నట్టుగా ఆయన వందిమాగధులు బాకాలు ఊదేవారు. ఇదంతా పైకి కనపడిన బిల్డప్... లోపల కథ వేరే ఉంది. ఆ కథ మన జనానికి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. అదే విజన్ 2020
నిజానికి విజన్ 2020 అంటే పాతికేళ్ల తర్వాత ఎన్నికలతో సంబంధం లేకుండా బాబు గారి అధికారమే చెల్లుబాటు అయ్యే ఒక బృహత్తర పధకం. అంటే... ఇంకా వివరంగా చెప్పాలంటే... ప్రజాస్వామ్యం అన్నాక ఎన్నికలు తప్పవు... ఎన్నికల్లో గెలిచిన వారే అధికార పీఠం పై కూర్చుంటారు. కానీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అధికార పీఠంపై ఎవరు ఉన్నా తన మాటే చెల్లుబాటు అయ్యే ప్లాన్. ప్రపంచంలోనే ఏ నేతకు రాని గొప్ప ఐడియా... ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామిక సమాంతర నియంతృత్వ పాలన. దీనికి 1995లో తాను ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగానే బీజం వేశారు. పాతికేళ్ల పీరియడ్ పెట్టుకున్నారు. అందుకే విజన్ 2020 అన్నారు... అప్పట్లో పదే పదే ఈ మాటే ఉపదేశించేవారు...

ఏదేమైనా చంద్రబాబు గ్రేట్ రా బాబూ... అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగాడు. గొప్ప విజన్ ఉన్న మనిషి. ఈ పాతికేళ్లలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అన్ని వ్యవస్థల లోనూ మర్రి చెట్టు ఊడల్ని దింపినట్టు దింపేశాడు. అందుకే 2019 ఎన్నికల్లో ఓడితే ఏమి... గెలిచి జగన్ ఏమి చేయలేని విధంగా తన చేతిలో ఉన్న వ్యవస్థలతో కాళ్ళు, చేతులు కట్టి పడేశాడు. విజన్ 2020 అసలు అర్ధం ఏమిటో పాపం... పిచ్చి జనాలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది.
ఇప్పుడు చంద్రబాబును ఎవరూ ఏమీ పీకలేరు... చంద్రబాబు మోనార్కు. ఈ రాష్ట్రంలోనే కాదు... దేశంలోనే చంద్రబాబు ని పీకే దమ్ము ఎవరికీ లేదు. హై కోర్టు , సుప్రీం కోర్టు లో కూడా ఆయన మనుషులే ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ... ఎవరు అధికారంలో ఉన్నా చంద్రబాబు కు జీ హుజూర్ అనాల్సిందే... ఎందుకంటే వాళ్ళందరిని వెనుక ఉండి నడిపించే రిలయెన్స్ అంబానీ తో మన బాబు గోరికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టి.. సో.. ఇప్పుడు బాబు గారి మీద ఈగ వాలితే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు సైతం సిగ్గు...ఎగ్గూ.. మానాభి మానాలు.. నైతిక విలువలు అన్నీ వదిలేసి బాబు గారి పక్కన నిలబడి ఈగల్ని తోలుతుంటారు. అవసరమైతే స్టెన్ గన్ లు తెచ్చి టప టపా కాల్చి పారేస్తారు. తస్మాత్ జాగ్రత్త... బాబు గోరంటే ఏమనుకున్నారు... ఇప్పటికయినా తెలుసుకోండి.. ఎవరితో నయినా పెట్టుకోవచ్చు కానీ... చంద్రబాబుతో పెట్టుకోకూడదని...
నిజమే కానీ... తాడి దన్నే వాడి తల దన్నే వాడు ఉంటాడు. నాడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి.. నేడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి... ఆ కోవకు చెందిన వారే.. అందుకే 2004-2009 మధ్య కాలంలో ఈయన మాటలు ఏమీ సాగక కుక్కిన పేనులా పడి ఉన్నాడు. ఆ తర్వాత రాజకీయ శిఖండి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో బాబు మాట చెల్లింది. ఆ తర్వాత మాయోపాయాలతో మళ్ళీ గద్దె నెక్కి అమరావతి నగర సృష్టికి బీజం వేశాడు. లక్షల కోట్ల సంపద సృష్టికి పధకం రచించాడు. వెధవ ఎన్నికలు వచ్చి బాబు గారి ప్లాన్ అంతా తల కిందులు చేశాయి..... అయితే ఏమి... పాతికేళ్ల కిందట వేసిన బీజాలు అన్నీ ఇప్పుడు మహా వృక్షాలై ప్రత్యర్థుల ఆరోపణల సెగ ఏ మాత్రం తగలకుండా ఆయన్ను కాచుకుంటున్నాయి... ఆయనకు చల్లని నీడ ఇస్తున్నాయి. కానీ... జగన్ ను తక్కువ అంచనా వేయొద్దు చంద్రబాబూ... నీ రూట్లోనే వచ్చి... నీ ఊడలు అన్నీ పీకిపెడతాడు. ఆ తర్వాత ఆ ఊడల తోనే నీ మెడకు ఉరి తాడు వేస్తాడు. తస్మాత్... జాగ్రత్త...
చాలా బాగుంది అన్నా వివరణ
రిప్లయితొలగించండి