Translate

  • Latest News

    27, ఆగస్టు 2020, గురువారం

    పూరీ...ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు..


    పూరీ... నీ సినిమాల సంగతి నువ్వు చూసుకో... ఇడియట్.... పోకిరి... దేశముదురు... లోఫర్  ఇలా నీ మనస్తత్వానికి తగ్గ పేర్లు పెట్టుకో... సినిమాలు తీసుకో... అంతే కానీ... నువ్వేదో పెద్ద మేధావి ని అన్నట్టు లెక్చర్లు ఇవ్వమాకు... మడతడిపోద్ది...జాగ్రత్త... కుక్క పని... కుక్క చేయాలి... గాడిద పని గాడిద చేయాలి అనే కథ చిన్నప్పుడు చదివే ఉంటావు కదా... కుక్క పని గాడిద చేస్తే ఎలా తన్నులు తిందో తెలుసు కదా... మర్చిపోతే... మళ్ళీ ఒక్కసారి ఆ కథ చదువుకో... నువ్వేదో పది సినిమాలు తీసేయగానే గొప్పోడిననుకోకు... నువ్వు నీ రంగంలో కొన్ని విజయాలు సాధించావు అంతే... అంత మాత్రాన దేశం  గురించి.. ప్రజల గురించి... పేదల గురించి.. అందునా రిజర్వేషన్ల గురించి... మాట్లాడే అర్హత నీకు లేదు... అసలు సమాజం గురించి నీకు ఏం అవగాహన ఉందని నువ్వు మాటలాడతావు... నువ్వు ఏమన్నా ప్రజా సాహిత్యం చదివావా... సినిమాల పిచ్చోడివి... సినిమా పిచ్చతో హై స్కూల్ చదువుతో ఆపేసి మద్రాస్  చెక్కేసి... ఆళ్ళ దగ్గర... ఈళ్ళ దగ్గర పనిచేసి మొత్తానికి ఎలాగోలా సినిమా డైరెక్టర్ అయ్యావు... నీకు బాగా తెలిసిన పోకిరి వేషాల్ని హీరో వేషానికి అంటగట్టి సినిమా తీసేసి హిట్లు కొట్టావ్.
     ఓ కానిస్టేబులు కొడుకు కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా... అంటూ లా పాయింట్లు లేవదీసి... ఓ రోడ్ సైడ్ రోమియో ను హీరో ను చేసేసి ఒక తరం యువతరాన్ని మొత్తం  ప్రేమ పేరుతొ చెడగొట్టేసిన మహానుభావుడివి నువ్వు.... ప్రేమ తప్పు కాదు... కానీ వెనకటి సినిమాల్లో ప్రేమను ఎంత పవిత్రంగా చూపించారు.... నువ్వు వచ్చి ప్రేమను రోడ్డు మీద కీడ్చి ఎంత అపవిత్రం చేశావు.. నీ పుణ్యమే నాయనా... ఈ యాసిడ్ దాడులు... కిడ్నాపులు... లేవదీసుకుపోవడాలు గట్రా...
     సినిమాల్లో ఏదో చేసావు సరే... ప్రజలు... పేదలు... రిజర్వేషన్లు... ఓటు హక్కు... ఈ సిద్ధాంతాల రాద్ధాంతాల జోలి  నీ కెందుకు... ఏమంటావు. తెల్ల రేషన్ కార్డు తీసుకునే వాడికి ఓటు హక్కు రద్దు చేయాలా... తెల్ల రేషన్ కార్డు కావాలో... ఓటు హక్కు కావాలో తేల్చుకోవాలా... ఎన్నికలల్లో సారా పాకెట్ కి ఓట్లు వేసే తెల్ల రేషన్ కార్డు వాళ్ళ వల్లే చెడ్డ నాయకులు వస్తున్నారా... అహహా... ఏమి సిద్ధాంతము... ఏమి సూత్రీకరణ... పనికిమాలిన పోకిరి వెధవల నోట ఇంతకంటే గొప్ప పలుకులు ఏమి వస్తాయి. ఖాళి దొరికితే థాయ్ లాండ్ పోయి డ్రగ్స్, తీసుకుని, మందు కొడుతో కథలూ  రాసుకునే వాడివి... ఓ ఐటెం గాళ్  మోజులో పడి  సర్వం అర్పించుకున్న వాడివి... ఆస్తులు మొత్తం పోగుట్టుకుని.. తలకిందులైన స్థితిలో ఎలాగోలా మరో హీరోయిన్ ని అడ్డం పెట్టుకుని ఓ సినిమా తీసి హిట్టు కొట్టి మళ్ళీ గాడిలో పడ్డావు... జాగ్రత్తగా నీ సినిమాలు నువ్వు తీసుకో పరవాలేదు... నీ పోకిరి వేషాలు నువ్వు వేసుకుంటే అది నీ వ్యక్తిగతం... మాకు అనవసరం... అంతే గాని ప్రజల గురించి... పేదల గురించి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలమాకు... జాగ్రత్త... ఖపడ్డార్... 
    • Blogger Comments
    • Facebook Comments

    1 comments:

    Item Reviewed: పూరీ...ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top