Translate

  • Latest News

    29, జనవరి 2025, బుధవారం

    సీనీన‌టులు గ్లామ‌ర్ ఫీల్డ్ నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు

     




    సినీన‌టుల జీవిత‌మంటే రంగుల ప్ర‌పంచం. ఈ రంగుల ప్ర‌పంచంలో ఇమ‌డ‌లేక, అవ‌స‌ర‌మైన‌వి పొంద‌లేక కొంత‌మంది జీవితాల‌ను త్వ‌జిస్తుంటే, కొంత‌మంది ఆధ్యాత్మిక మార్గం వెతుక్కుంటున్నారు.

     ఈ కోవ‌లో ప్ర‌స్తుతం ప్రముఖ బాలీవుడ్‌ నటి మమతా కులకర్ణి (52) ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసినిగా మారారు. శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలోని కిన్నార్‌ అఖాడాలో ‘మాయీ మమతానంద్‌ గిరి’గా ఆమెకు నామకరణం చేశారు.ఆమె గతంలో అందాల తారగా ఒక్క వెలుగు వెలిగారు. మమత తెలుగులోనూ రెండు సినిమాలు చేశారు! చాలామందికి ఏమీ తెలియక ఎగిరెగిరి పడుతున్నారని చివరికి ఎవరికైనా ఈ మార్గమే పూలబాట అని మమత వ్యాఖ్యానించారు. ట్రాన్స్ జెండర్స్ కు చోటు ఇచ్చే లక్ష్మీనారాయణ త్రిపాఠీ ఆశ్రమంలో ఆమె సన్యాసం స్వీకరించడం విశేషం.

     సినీ పరిశ్రమను వదిలి ఆధ్యాత్మిక, సేవామార్గంలో నడిచిన సినీ తారలు గతంలోనూ ఉన్నారు. ఆ జాబితాలో అను అగర్వాల్, బర్ఖా మదన్, దంగల్ నటి జైరా వాసిమ్, సోఫియా హయత్ ఉన్నారు. అంతేగాక బాలీవుడ్ లెజెండరీ నటుడు వినోద్ ఖన్నా కూడా ఒకానొక సమయంలో సినిమాలకు దూరమై ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టారు.బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ... సినీ నటి సనా ఖాన్ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్ర‌య‌ణించారు. 



    అను అగ‌ర్వాల్ 1990లో తన తొలి బాలీవుడ్ చిత్రం ఆషికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాతో అను ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత నటించిన గజబ్ తమాషా, జనమ్ కుండ్లీ, కింగ్ అంకుల్, రిటర్న్ ఆఫ్ జ్యువెల్ థీఫ్ చిత్రాల్లో నటించింది. ఊహించని రోడ్డు ప్రమాదంతో సినిమాలకు దూరమైంది. 1999లో జరిగిన ఓ ప్రమాదం ఆమె జీవితాన్ని కుదిపేసింది. దాదాపు నెల రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అను అగర్వాల్ ఫౌండేషన్‌ను నడుపుతూ, యోగా క్లాసులు నిర్వహిస్తోంది.



    బర్ఖా మదన్  ఓ మోడల్. సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్ లాంటి అందగత్తెలతో పోటీపడింది. కొద్దిలో మిస్ ఇండియా టైటిల్ చేజార్చుకుంది. అక్కడ మిస్ అయినా సరే పలు హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటించింది. కానీ ఏమైందో ఏమో గానీ సడన్‌గా సన్యాసినిగా మారిపోయి అందరికీ షాకిచ్చింది. పంజాబ్‌లో పుట్టి పెరిగిన ఈమె.. యాక్టింగ్ అంటే ఆసక్తి ఉండటంతో మోడలింగ్ రంగంలోకి వచ్చింది. 1994లోనే 'ఫెమినా మిస్ ఇండియా' పోటీలో పాల్గొంది. అదే ఏడాది సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్లు పాల్గొన్నారు. దీంతో ఈమె తొలి రన్నరప్‌గా నిలిచింది. అనంతరం 'మిస్ టూరిజం వరల్‌ వైడ్' పోటీలోనూ రన్నరప్ అయ్యింది.

    1996లో 'ఖిలాడీయో కా ఖిలాడీ' సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత 2012 వరకు మరో ఆరు మూవీస్ మాత్రమే చేసింది. వీటిలో రామ్ గోపాల్ వర్మ తీసిన 'భూత్' కూడా ఉంది. ఇందులో దెయ్యంగా అద్భుత నటన కనబరిన బర్ఖా.. నాలుగు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో అకస్మాత్తుగా సన్యాసినిగా మారిపోయింది.ప్పుడైతే సన్యాసిగా మారిందో తన పేరుని 'గ్యాల్టెన్ సామ్టెన్' అని మార్చుకుంది. ప్రస్తుతం ఈమె పర్వతాలు, ఆశ్రమాల్లో తిరుగుతూ కనిపిస్తోంది.



    అవార్డ్ విన్నర్, బాలీవుడ్ నటి జైరా వాసిం సినిమాలకు స్వస్తి పూర్తిగా మ‌త విశ్వాసాల ప్ర‌కారం జీవిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దంగల్' మూవీ ద్వారా నటిగా కెరీర్ మొదలు పెట్టిన జైరా వాసిం... 'సీక్రెట్ సూపర్ స్టార్' మూవీలో ప్రధాన పాత్ర పోషించారు.నాలోని ప్రశాంతతను, నా విశ్వాసాలను, అల్లాతో నా రిలేషన్ చెడిపోయే విధంగా ఉన్న ఈ వాతావరణంలో ఉండలేక పోతున్నాను. అందుకే నటనకు స్వస్థి చెప్పి బాలీవుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు జైరా వాసిం తెలిపారు.



    హిందీ చలనచిత్రసీమలో వినోద్ ఖన్నా స్థానం ప్రత్యేకమైనది. ప్రతినాయక పాత్రల్లో అడుగు పెట్టి సూపర్ స్టార్ గా అలరించిన నటుడు వినోద్ ఖన్నా. మధ్యలో ఐదేళ్ళు ‘ఓషో’ మార్గం పట్టి సినిమారంగాన్ని వీడినా, మళ్ళీ వచ్చి నటునిగా రాణించారు వినోద్ ఖన్నా. రాజకీయాల్లోనూ ప్రత్యేక బాణీ పలికించారు వినోద్. నాలుగు సార్లు ఒకే నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికై, కేంద్రమంత్రిగానూ రాణించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారాయన. వినోద్ ఖన్నా మరణానంతరం ఆయనకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు.

    ప్ర‌తి మ‌నిషి త‌న‌కు ఇష్ట‌మైన మార్గాన్ని ఎంచుకొనే స్వేచ్చ ఉంది. కాని పూర్తిగా గ్లామ‌ర్ ఫీల్డ్ నుంచి ఆధ్మాత్మిక రంగం వైపు ప‌య‌ణించ‌టం అంటే ఆయా వ్య‌క్తుల జీవితాల్లో నుంచే, వారి ఆలోచ‌న‌ల నుంచే చూడాలి. 

    ------------

    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సీనీన‌టులు గ్లామ‌ర్ ఫీల్డ్ నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top