ప్రస్తుతం ఈ అంతర్జాల మాయాజాల యుగంలో చానళ్ళు, వెబెసైట్లు రేటింగులు, వ్యూయర్షిప్ లు వీటికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. చానళ్లకు రేటింగులు ఎంత ముఖ్యమో, వెబ్సైట్లకు వ్యూయర్షిప్ లు అంతే ముఖ్యం. ఈ విధంగా చూస్తే రాజ్యం చేసే అరాచకాలపై గొంతెత్తి నినదించే, అణగారిన వర్గాల ప్రజలకు అండగా, సమాజంలో భిన్నస్వరాలు వినిపించేందుకు వేదికగా నిలిచి, ప్రత్యామ్నాయ రాజకీయ శిబిరాలకు మద్దతు పలికే విప్లవ రచయితల సంఘం (విరసం) యు ట్యూబ్ ఛానల్ కేవలం ఏడాది కాలంలో 10 లక్షల వ్యూయర్షిప్ సాధించడం వర్తమాన సమాజంలో చెప్పుకోదగ్గ పరిణామం. అంతేకాక దాదాపు 3 వేల మంది సబ్ స్క్రైబర్స్ ను కలిగి ఉండడం మరో విశేషం. ఈ ఛానల్ ను విరసం ప్రతి పక్షం రోజులకు ఒకసారి అప్ డేట్ చేస్తోంది. ఇందులో విరసం పత్రిక అరుణతార అన్ని సంచికలు అప్ లోడ్ చేసారు. వీటితో పాటు మీటింగ్స్, క్లాసులు, వీడియోలు, జన నాట్య మండలి పాటలు, విరసం ప్రముఖుల ఉపన్యాసాలు ఉంటాయి. అయితే వ్యూయర్స్ లో ఎక్కువగా జన నాట్య మండలి పాటలు చూసే వారే ఉన్నారు. తర్వాత వరవరరావు, ఇతర ప్రముఖుల ఉపన్యాసాలు చూస్తున్నారు.
ప్రస్తుతం మీడియా (పత్రికలూ, చానళ్లు కూడా ) ఒక పక్షం వైపు భయసగా ఉండడం వలన ప్రజల్లో, ముఖంగా కామ న్ మాన్ లో నిజాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిందని, వారు వాస్తవాలు తెలుసుకోవడానికి ఇటువంటి వెబ్సైట్ పై ఆధార పడవలసి వస్తోందని అంటున్నారు విరసం కార్యదర్శి వరలక్ష్మి. కేవలం ఈ ఏడాది కాలంలోనే విరసం వెబ్సైట్ 10 లక్షల వ్యూయర్షిప్ పొందుతుందని మేము కూడా ఊహించలేదన్నారు. అంతేకాక మా వ్యూయర్స్ లో ఎక్కువగా విద్యార్థులు, మరి ముఖాయంగా యూనివర్సిటీ విద్యార్థులు ఉండడం విశేషమన్నారు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి