కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు ... అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి . ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేవం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సన్నిహితుడనే పేరున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు . మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో పవన్ పలు అంశాలపై ట్వీట్ లు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ``పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు. అతను సినిమా నటుడంటా! నేను సినిమాలు చూసి 20 ఏళ్లయింది`` అని ఎద్దేవా చేశారు. కాగా సౌమ్యుడిగా పేరున్న అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలు ఇటు టీడీపీలో అటు జనసేన వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.మంత్రి పితాని అయితే జనసేన జెండానే లేదన్నారు
"సంతోషం" అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ అభిమానులు, టీడీపీ అభిమానులూ ఎవరి వాదనలకనుగుణంగా వారు పోస్ట్‌లు పెడుతున్నారు.
వివాదం పెద్దది అవుతుండటంతో చంద్రబాబు స్పందించారు. సున్నితమైన అంశాలు, విధానపరమైన నిర్ణయాలపై పార్టీ అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడొద్దని, ఇలాంటి అంశాలను పార్టీ అగ్రనాయకత్వం చూసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీటర్ లో స్పందించారు
.మనం పార్టీ ఆంతర్గత నిర్మాణంలో ఆచరణాత్మకర్తగా అడుగులు వేస్తున్నాము. ప్రజాసమస్యల పరిష్కారమే. పరమావధిగా ముందుకు వెళుతున్నాము. ఈ తరుణంలో కొందరు పేరు కోసమో లేదా దృష్టి మరల్చడానికే లేదా మనల్ని చికాకు పర్చడానికే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అటువాటికి మీరెవ్వరు స్పందిచవద్దని మనవి చేస్తున్నాను .. అని ట్విట్ చేశారు. ఈ విషయాన్ని అంత త్వరగా ముగిసి పోయే వ్యవహారంగా భావించలేం . నిప్పూ లేనిదే పొగ రాదంటారు. ఇదంతా చూస్తుంటే పవన్‌కీ టీడీపీకి మధ్య దూరం పెరుగుతోందా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి