అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు షాడోల భయం పట్టుకుంది. షాడో అంటే మధుబాబు నవలలో ఉండే ఉండే డిటెక్టివ్ లాంటి వ్యక్తులే. ఆయా పార్టీలలో రహస్యంగా కొనసాగుతూ అధినాయకత్వానికి చీమచిటుక్కువున్నా విషయాన్ని చేరవేయటంలో వీరు సిద్దహస్తులు. అధికారపక్షం టీడీపీ ప్రకటించే పార్టీ కార్యక్రమాలు ఏలా కొనసాగుతున్నాయి. ఎవరెవరు కార్యక్రమంలో పాల్గొనటం లేదు. ఎందుకు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.? ఇత్యాది సమాచారంతో పాటు ప్రతి మండలం, గ్రామంలోనూ కులమతాలకు సంబంధించిన సమస్త సమాచారం, ప్రత్యర్థి పార్టీ బలాలు, బలహీనతలు ఒక్కటేమిటి. సమస్త సమాచారం అధినాయకత్వానికి చేరిపోతుంది.అయితే ప్రభుత్వ నిఘా వర్గాల సమాచారం ఉన్నా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన షాడోల సమాచారపైనే అధినాయకత్వం దృష్టిపెట్టినట్లు తెలిసింది. ఇటీవల కొంతమందితో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అంతా తనకు తెలుసని, అందరిని కలుపుకొని వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించటంతో ఆ నియోజవర్గ నాయకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. రాష్ట్రంలో ఉన్న మారుమూల పల్లెటూళ్ల గురించి కూడా సమాచారం అధినాయకత్వం వద్ద ఉండటంతో విస్తుపోయాడు. తన నియోజకవర్గంలో ఉన్న షోడోల వల్లే సమాచారం బయటకు పొక్కిందని ఆ నాయకుడు సన్నితులవద్ద వాపోయాడు.
ఇక వైకాపా విషయానికి వస్తే ఇది మరీ ఎక్కువ. ఈ పార్టీలో గ్రామాలు మొదలు కొని నియోజకవర్గం, జిల్లా వరకు షాడో వ్యవస్థ విస్తరించి ఉంది. ఈ విషయం ఆ పార్టీ నాయకులకే తెలుసు. పార్టీ అవిర్భావం నుంచి షాడో వ్యవస్థపై పార్టీ అధినాయకుడు జగన్ దృష్టి పెట్టారు. తన మీడియా సంస్థలో పనిచేసే విలేకర్లు, వారి ద్వారా ఏర్పాటు చేసిన వ్యవస్థ సమస్త బాధ్యతలు నిర్వర్తించేవారు. ప్రశాంత్ టీమ్ ఏర్పాటయ్యాక మరో షాడో వ్యవస్థ ఏర్పాటై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్సార్ కార్యక్రమం తీరుతెన్నులు, పాల్గొంటున్న నేతలు, గైర్హజరైన నాయకులు, అందుకు గల కారణాలు తదితర అంశాలపై రోజువారి నివేదికలు అధినాయకత్వానికి అందుతుంటాయి. పార్టీలను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ప్రతి విషయం కీలకమే. కాని పార్టీ క్యాడర్ను నిరాశపరిచే విధంగా, వారిపై అనుమానం రేకెత్తించే విధంగా ఉంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. పార్టీలో జరుగుతున్న తప్పలను సరిచేసుకోవటానికి నిఘా వ్యవస్థ గతం నుంచే ఉన్నదే. కాని ఈ షాడో వ్యవస్థ పార్టీని శాసించేలా ఉండకూడదు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి