'దంగల్' వంటి భారీ విజయం తర్వాత ఆమిర్ ఖాన్ వెండితెరపై కనిపించబోయే సినిమా 'సీక్రెట్ సూపర్ స్టార్'. తన స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నాడు ఆమిర్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌లో ఆడియెన్స్ ముందుకు రానుంది.
ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సరికొత్త కథాంశాలతో సినిమాలను నిర్మిస్తుంటాడు బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. తాజాగా ఆమిర్ ప్రొడక్షన్ హౌజ్ నుండి వస్తోన్న 'సీక్రెట్ సూపర్ స్టార్' చిత్రం ట్రైలర్ విడుదలయ్యింది.
సంగీత ప్రధానంగా విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మిస్తోన్న చిత్రం 'సీక్రెట్ సూపర్ స్టార్'. ఓ మారుమూల గ్రామానికి చెందిన ముస్లిం విద్యార్థిని సంగీతంపై ఆసక్తితో తండ్రికి తెలియకుండా యూట్యూబ్ ద్వారా తన పాటలతో ఎలా పాపులర్ అయ్యింది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో ఆ 'సీక్రెట్ సూపర్ స్టార్'గా జైరా వసీమ్ నటించింది. చాన్నాళ్ల క్రితం విడుదలైన టీజర్‌లో సినిమా కథాంశాన్ని క్లుప్తంగా చెప్పిన మేకర్స్ ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌లో కథాంశాన్ని మరింత విపులంగా వివరించారు. ఈ చిత్రంలో జైరా వాసిం, అమీర్‌ఖాన్, మెహర్ విజ్, రాజ్ అర్జున్, హర్ష జా, ఆర్యన్ ఆసిక్, మంజు శర్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అమిత్ త్రివేది అందిస్తున్నాడు
మరి ఆమిర్ ఖాన్ సంస్థ నుంచి చిన్న సినిమాగా వస్తోన్న 'సీక్రెట్ సూపర్ స్టార్' పెద్ద విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి