Translate

  • Latest News

    1, మే 2020, శుక్రవారం

    5వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం


    ఈ నెల 5వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలా.. లేక దశల వారీగా ఎత్తివేయాలా.. అన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఈ నెల 3వ తేదీతో ముగియనుంది. కానీ తెలంగాణలో లాక్‌డౌన్‌ను 7వ తేదీ వరకు పొడిగించారు. 8వ తేదీకల్లా కరోనా తగ్గుముఖం పడుతుందని, తర్వాత కొత్త కేసులు నమోదు కాకపోవచ్చని ప్రభుత్వం ధీమాతో ఉంది. అయినప్పటికీ లాక్‌డౌన్‌ను ఏకకాలంలో ఎత్తివేసే అవకాశాలు లేవని తెలుస్తోంది.    గ్రీన్‌జోన్లలో మినహాయింపులు ఇచ్చి... రెడ్‌ జోన్లలో మరికొంత కాలం లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11 జిల్లాల్లో కరోనా కేసులు లేవు. గ్రేటర్‌ హైదరాబాద్‌, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో డేంజర్‌ జోన్‌లో ఉన్నాయి. అయితే రెండు మూడు రోజులుగా సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌లలో కూడా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉండగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి సడలింపుతో పాటు హెలికాప్టర్‌ మనీపై కేంద్రాన్ని మరోసారి విజ్ఞప్తి చేసేలా మంత్రివర్గంలో తీర్మానం చేసే అవకాశాలు లేకపోలేదు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: 5వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top