Translate

  • Latest News

    19, సెప్టెంబర్ 2017, మంగళవారం

    శ్రీలంక లో ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు .. ప్రతిరోజూ 8 మంది బలి



    శ్రీలంకలో ప్రతిరోజూ 8 మంది ఆత్మహత్య చేసుకుంటారని అక్కడి ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసేంది. ఇది ఆందోళన కలిగించే అంశం కావటం తో అక్కడి ప్రభుత్యం పూర్తి స్థాయి లో దృష్టి పెట్టింది  ఆత్మాహుతి బాధితుల్లో పురుషులు ఉన్నారని నివేదిక బయట పెట్టింది .అక్కడి పోలీస్ శాఖ  నివేదిక  ప్రకారం 2015 లో 3058 మంది వివిధ కారణాలతో  ఆత్మహత్యలు చేసుకున్నారు. 2016 లో 2339 పురుషులు మరియు 668 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో1597 ఆత్మహత్యలు  చేసుకోగా  1275 మందిలో 322 మంది మహిళలు.ఉన్నారు గత రెండు దశాబ్దాలుగా వార్షిక ఆత్మహత్య రేటు సగం ఆత్మహత్య రేటుకు తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.1995 లో, 8500 ఆత్మహత్య చేసుకోగా  ,  2005  నుంచి 2015 నాటికి 3025  కు తగ్గయని స్పష్టం చేసారు  దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న  యువతపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృష్టి కేంద్రీకరించింది.ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇందుకోసం  ఒత్తిడిని తగ్గించి ,యువత లో మానసిక స్తైర్యాన్ని పెంచటానికి ప్రయత్నాలు ప్రారంభించారు.  మనస్తత్వవేత్తలు మద్యపాన వినియోగం,మానసిక సమస్యలు ఉన్నవారిని గుర్తించి సరైన చికిత్స అందజేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు



    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: శ్రీలంక లో ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు .. ప్రతిరోజూ 8 మంది బలి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top