Translate

  • Latest News

    20, అక్టోబర్ 2017, శుక్రవారం

    సాక్షి... బీ అలర్ట్..!


    .తెలుగు పత్రికలలో సర్క్యూలేషన్ పరంగా రెండవ స్థానంలో ఉన్న సాక్షి ని దెబ్బతీయడానికి మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతి మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఇది కేవలం పత్రికల మధ్య పోరు అయితే సాక్షి పెద్దగా భయపడాల్సిన పని  లేదు. ఎందుకంటే పత్రికల మధ్య అది మామూలే. కానీ ఈ ప్లాన్ వెనుక చంద్ర బాబు ఉన్నాడు. డబ్బులు ఎరజూపి వై.సి.పి ఎమ్మెల్యే లను కొని ఆ పార్టీని దెబ్బతీసినట్టే ఇప్పుడు ఆ పార్టీకి ఆయువుపట్టు అయిన సాక్షి పత్రికను దెబ్బతీయడానికి దిమ్మ తిరిగే ప్లాన్ వేసాడు. అది తన ఆప్త మిత్రుడైన రాధాకృష్ణ పత్రిక ఆంధ్రజ్యోతి ద్వారా అమలుచేయడానికి పధకం సిద్ధం చేసాడు.

     అదేమిటంటే ...ఏ పత్రికకు ఆయన కీలకం డెస్క్. డిస్క్లో ఉండే సబ్ ఎడిటర్లు.  సాక్షి లో సబ్ ఎడిటర్లుకు  అక్కడ ఇచ్చేదానికన్నా 5 వేలు ఎక్కువ ఇచ్చి , ఆ విధంగా 13 జిల్లాల్లో జిల్లాకు 5 లేదా 10 మందిని ఆంధ్రజ్యోతి లాగేసి సాక్షి డెస్క్ ను నిర్వీర్యం చేయడం. ఈ ప్లాన్ ను జనవరి నుంచి అమలులోకి తేవాలని నిర్ణయించారట. ఇందుకోసం 5 కోట్లు కేటాయించారని తెలుస్తోంది. ఈ విధంగా తీసుకున్న వారికి డెస్క్ లో పెద్దగా బాధ్యతలు ఏమి అప్పచెప్పకుండా నామమాత్రంగా పని చేయించుకుంటారట. ఆఫ్ కోర్స్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారి గోల్ సాధించాక వీరిని తీసేయవచ్చు కూడా... ఇదీ సంగతి. మరి ఈ దిమ్మ తిరిగే ప్లాన్ ను సాక్షి ఎదుర్కొని నిలబడగలుగుతుందా.. లేదా నంద్యాలలో లాగా చతికిలబడుతుందా వేచిచూడాలి.  

    శ్రీ హర్ష 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సాక్షి... బీ అలర్ట్..! Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top