Translate

  • Latest News

    19, మార్చి 2018, సోమవారం

    సైన్ధవుడి లా అడ్డు పడుతున్న అన్నా డి.ఎం.కే ఎం.పీ లు


    పార్లమెంట్ లో వై.సి.పీ., తెలుగుదేశం పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను చర్చకు రానీయకుండా తమిళనాడుకు చెందిన అన్నా డి.ఎం.కే పార్టీ కి చెందిన ఎం.పీ లు సైన్ధవుల్లా అడ్డుపడుతున్నారు. వాళ్ళ ఆందోళన అడ్డం పెట్టుకుని స్పీకర్ శనివారం లాగానే, సోమవారం కూడా సభను వాయిదా వేశారు. మీడియాలో చెబుతున్న లెక్కల ప్రకారం విశ్వాస తీర్మానానికి 54 మంది సభ్యుల మద్దతు ఉంటె చాలు... సభలో చర్చకు పెట్టవచ్చు. మీడియాలో చెబుతున్న లెక్కల ప్రకారం విశ్వాస తీర్మానానికి 154 మంది సభ్యుల మద్దతు ఉండగా... వ్యతిరేకంగా 349 మంది సభ్యులు ఉన్నారు. సభా సంప్రదాయాన్ని అనుసరించి ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు దానికి కనీస మద్దతు(54) ఉన్నపుడు తప్పనిసరిగా చర్చకు పెట్టాలసిందే. కానీ అధికారంలో ఉన్న బి.జె.పీ తన కీలు బొమ్మ లాంటి అన్నా డి.ఎం.కే ఎం.పీ లతో సభలో చర్చకు రానీయకుండా కావాలని అల్లరి చేయిస్తూ ఆ వంక పెట్టుకుని సభను వాయిదా వేయిస్తూ వస్తోంది.  మరో వైపు వై.సి.పీ మళ్ళీ మంగళవారం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నోటీసు ఇచ్చింది. వై.సి.పీ బి.జె.పీ తో లాలూచి పడిన పార్టీ కాబట్టి అది అడిగితే ఎవరూ మద్దతు ఇవ్వరు... మేం  అడిగితే అందరు మద్దతు ఇస్తారు అని చెబుతున్న తెలుగు దేశం పార్టీ మరి అన్నా డి.ఎం.కె పార్టీ తో మాట్లాడి ఎందుకు ఒప్పించలేక పొతొంది... నేను అందరిని కలుపుకుని మద్దతు సమీకరిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పడు అడిగితే నేను ఏప్రిల్ 5 న పెట్టమంటే ఇప్పడే ఎందుకు పెట్టారంటున్నాడు. ఓర్నీ నాటకాలో ... పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న ఈ నాటకాల్ని  చూసి ప్రజాస్వామ్య వాదులు చీదరించుకుంటున్నారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సైన్ధవుడి లా అడ్డు పడుతున్న అన్నా డి.ఎం.కే ఎం.పీ లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top