Translate

  • Latest News

    1, జూన్ 2018, శుక్రవారం

    బి.జె.పీ ని ముస్లింలు కసిగా ఓడించారు


    ఉత్తరప్రదేశ్ లో బి.జె.పీ ని ముస్లింలు కసిగా ఓడించారు. ఎందుకంటే దేశంలోనే ఎక్కువ ఎం.పీ సీట్లు (80) ఉన్న ఉత్తరప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో ఒక్క ముస్లిం కూడా ఎం.పీ గా గెలవలేదు. అప్పట్లో మోడీ మాయాజాలంతో 80 సీట్లలో బి.జె.పీ 71 సీట్లను గెలుచుకుంది. కానీ అంతమందిలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం గమనార్హం. హిందుత్వ అజండాయే మౌలిక సూత్రంగా పుట్టుకొచ్చిన బి.జె.పీ కి ఉన్న ముస్లిం వ్యతిరేకత ఇక్కడ స్పష్టంగా గోచరించింది. దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలు గెలిచిన మిగతా 9 సీట్లలో కూడా ముస్లింలు ఒక్కరు కూడా లేరు. గత ఏడాది రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో కూడా అమిత్  షా కుల సమీకరణాల మాయాజాలమో, ఈ.వీ.ఎం ల మాయాజాలమో కానీ బి.జె.పీ 403 సీట్లలో 325 సీట్లు గెలిచి, మూడొంతుల సీట్లు సాధించి  అధికారంలోకి వచ్చింది.  అగ్నికి ఆజ్యం తోడైనట్టు మోడీ అక్కడ ముఖ్యమంత్రి గా మాజీ స్వామిజి ఆదిత్యనాధ్ ను నియమించారు. సహజంగానే స్వామిజి గారికి ముస్లిం లు అంటే పడదు కదా.... ఇక ఆయన వచ్చాక పది నెలల కాలంలోనే 1142 ఎన్ కౌంటర్లు చేయించాడు. వీటిలో 39 మంది గ్యాంగస్టర్ లను అంతమొందించినట్టు యోగి ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్ కాల్పుల్లో 265 మంది గాయపడ్డారు. కేవలం నలుగురు పోలీసులే మరణించారు. యోగి పాలనపై కసితో ఉన్న ప్రతిపక్షాలు, ముఖ్యంగా ముస్లింలు అవకాశం కోసం ఎదురు చూశాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కీరానా లోక్ సభ స్థానం నుంచి ఆర్.ఎల్.డి,ఎస్.పీ, బి.ఎస్.పీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి తబస్సుమ్ హాసన్ 44,618 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. నూర్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఎస్.పీ అభ్యర్థి కాంగ్రెస్, బి.ఎస్.పీ, ఆప్ పార్టీల మద్దతుతో 5,662 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ రెండు స్థానాలు గతంలో బీ.జె.పీ వే కావడం గమనార్హం. 
    2019 లో ఆంధ్రప్రదేశ్ లో సైతం ఇంతేనా... 
    ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో అధికారం లోకి వచ్చాక మంత్రివర్గంలో ఒక్క ముస్లిం ను కూడా తీసుకోలేదు. తెలుగుదేశం తరపున ఒక్కరు కూడ ముస్లిం ఎం.ఎల్.ఏ లేరు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్ లలో ఒకరిని మంత్రివర్గం లోకి తీసుకుని తర్వాత ఎం.ఎల్.సి అయినా ఇచ్చి ఉండవచ్చు. కానీ ఆలా చేయలేదు.  మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపించి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన ముగ్గురు ముస్లిం ఎం.ఎల్.ఏ లను తన వైపు లాగేసుకున్నారు.. కానీ వారిలో కూడా ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రి పదవులు ఇవ్వకుండా... కార్పొరేషన్ పదవులు ఇచ్చి, రంజాన్ తోఫా లు ఇచ్చి మాయ చేయచ్చు అనుకుంటే నమ్మడానికి ముస్లిం లు మరీ అంత అమాయకులు ఏమి కారు... వాళ్ళు కూడా 2019 ఏ.పీ  అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో లాగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార పక్షానికి బుద్ధి చెప్పి తీరుతారు... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బి.జె.పీ ని ముస్లింలు కసిగా ఓడించారు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top