Translate

  • Latest News

    19, జూన్ 2018, మంగళవారం

    ఎందుకింత అసహనం బాబూ..


    పాపం... వారు దేవాలయాల్లో క్షురకులు... కేశ ఖండనం చేసి చిల్లర డబ్బులతో జీవనం సాగించే బడుగు జీవులు... ఏనాడూ తమకు అది కావాలీ... ఇది కావాలి అని అడిగి ఎరుగరు... ఇప్పడు హోం గార్డులను చూసి, వి.ఆర్.ఏ లను చూసి మాకు కూడా కనీస వేతనం ఇవ్వక పోతారా అని ఆశ పడ్డారు. అడగందే అమ్మయినా పెట్టదు కదా... అని సి.ఎం ను అడగడానికి సచివాలయానికి వెళ్లారు. అక్కడ ఆ గుంపులో ఎవరో కొందరు సి.ఎం డౌన్...డౌన్.. అని అరిచారు... అంతే ... చంద్రబాబు గారికి కోపం కట్టలు తెంచుకుంది. పాపం... ఆ అల్పుల ముందు తన విశ్వరూపం చూపించాడు. ఏం తమాషా చేస్తున్నారా...  పిచ్ఛాటలాడుతున్నారా... తోక జాడిస్తే కట్ చేస్తా... ఇంకోసారి ఇలా చేస్తే గుడిలో కూడా అడుగు పెట్టనివ్వను. మీరు ప్రభుత్వాన్ని శాసించకూడదు... రౌడీలను తీసుకువచ్చి బెదిరిస్తారా... ఎవర్ని బెదిరిస్తారు మీరు... 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా... ఒక్కరు కూడా రోడ్డు మీదకు రాలేదు... మిమ్మల్ని ఇంతమందిని లోపలకు రానివ్వడమే తప్పు. ఈ విధంగా సాగింది బాబు గారి ఏకపాత్రాభినయం... ఆయన వన్ మాన్ షో కి అక్కడ ఉన్న వారంతా బిత్తర పోయారు. నోటా మాట రాలేదు. నాయి బ్రాహ్మణ సంఘాల నేతలు కంగు తిన్నారు. సి.ఎం గారికి ఆగ్రహం వస్తే ఇంకేమైనా ఉందా... ఆయన్ను కాదని... ఈ అమరావతి గడ్డ మీద బతికి బట్ట కట్టగలమా... అని భయపడిపోయి పాపం... నాయి బ్రాహ్మణ సంఘాల నేతలు సాయంత్రం ఉండవల్లి లో సి.ఎం నివాసానికి వెళ్లి క్షమాపణ వేడుకున్నారు. డౌన్..డౌన్ అన్న వారెవరో అసలు తమకు తెలియదని... వారికి...తమకు అసలు సంబంధం లేదని... మాకు తెలియకుండా ఎవరో సంఘ విద్రోహ శక్తులు మాతో పాటు కలసిపోయి అలా చేశారని వివరణ ఇచ్చుకున్నారు. నాయి బ్రాహ్మలకు నాడు ఎన్ టి ఆర్ , తర్వాత మీరే సార్ మేలు చేసింది... మీ మేలు ఎన్నటికీ మరువం అంటూ చెప్పుకున్నారు. మేము మీ దాసానుదాసులం అంటూ  భజనలు పాడి చంద్ర కరుణా కటాక్షాల కోసం సాగిలపడ్డారు... మరి బాబు గారంటే ఏమనుకున్నారు.. ఆయన తోనే పెట్టుకుంటారా... బి.సి. లు బి.సి ల్లా పడి  ఉండాలి కానీ.. గొంతెత్తితే... గొంతులు తెగిపోతాయి... జాగ్రత్త సుమా... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఎందుకింత అసహనం బాబూ.. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top