Translate

  • Latest News

    10, జులై 2018, మంగళవారం

    ముందు యుగం దూతలు...


    నేటి యువతరం ముందు యుగానికి దూతలు... ఈ తరంలో అభ్యుదయ భావాల సౌధాన్ని నిర్మించాలని కలలు కంటున్న నడివయసులో ఉన్న అభ్యుదయ పథగాములకు, ముదిమి వయసులో ఉన్న నాటి విప్లవ పోరాట యోధులకు  నిజమైన వారసులు... ఆధునిక భావాల సారధులు... మహాకవి శ్రీశ్రీ చెప్పిన కొంతమంది యువకులు  వీళ్ళే... ముందు యుగం దూతలు వీళ్ళే...  పావన నవజీవన బృందావన నిర్ణేతలు వీళ్ళే... వాళ్లకు మనం ఆహ్వానం పలుకుదాం... వారికి మనం లాల్ సలాం చేద్దాం... 
    ఆధునిక ప్రపంచం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల్లో నెట్(అంతర్జాలం) యువతను ఓ పక్క ఎంతగా చెడగొడుతోందో... మరో పక్క యువతలో అభ్యుదయ భావాలను నూరిపోస్తోంది. నెట్ పుణ్యమా... అని నేటి యువత తాత గారి..బామ్మ గారి భావాలకు దాసులు కాకుండా తమ సొంత వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటున్నారు. నేటి నిజం చూడలేని కీటక సన్నాసుల్లా ఉండకుండా... నిజాన్ని చూడడమే కాదు... దాన్ని విశ్వసించి ఆచరణలో పెడుతున్నారు. పుట్టుకతో వృద్ధుల్లా కాకుండా... చైతన్య దీప్తుల్లా వెలుగొందుతున్నారు. పేర్లకి, పకీర్లకి..పుకార్లకు బానిసల్లా కాకుండా... వాస్తవాల పునాదులపై ఆధునిక భావాలతో అభ్యుదయ సౌధాల్ని నిర్మించుకుంటున్నారు.
    ఈనాడు మెయిన్ ఎడిషన్ మొదటి పేజీ బాటమ్ స్టోరీగా ఈ రోజు(10-7-2018) నెట్ చెక్కిన నవతరం పేరిట ఒక మంచి ఆర్టికల్ ప్రచురించింది. నాలుగు రోజుల కిందట ఓ ఛానల్ లో యువతరంలో పెరుగుతున్న భక్తి అనే కథనానికి ఇది కౌంటర్ గా ఉంది. మొత్తానికి ఒక మంచి కధనం ప్రచురించారు. 
     విజన్ 2050 ను కలగంటే... మిలీనియం (2000) తర్వాత 21 వ శతాబ్దం లో పుట్టిన తరం మన దేశాన్ని ఉన్నత పధంలోకి తీసుకువెళుతుంది. అయితే ఈ మధ్యలో పానకంలో పుడకల్లా, హర్డిల్స్ లా  తాతల నాటి భావాలను పెంచి పోషిస్తూ జాతకాలు, న్యూమరాలజీలు, జెమాలజీలు అంటూ జనాల్ని మూఢత్వంలోకి నెట్టేస్తూ దోచుకు తింటున్న వారిని, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ తో డబ్బులకోసం నైతిక వ్యభిచారం చేస్తున్న టి.వి చానల్స్ వారిని నియంత్రించి, అశాస్త్రీయ విధానాలను పబ్లిక్కుగా ప్రచారం చేసుకోకుండా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంత అయినా ఉంది. అప్పుడు దొంగ స్వామీజీ ల తోకలు  కత్తిరించే విచ్చు కత్తులాంటి యువకులు ఎంతోమంది పుట్టుకొస్తారు. ఒక్క కత్తి  మహేష్ ను నగర బహిష్కరణ చేయించి సంబరపడడం కాదు... ముందు తరం ఒక్కొక్కడు ఒక్కో కత్తి మహేష్... ఒక్కో బాబు గోగినేని.. ఒక్కో త్రిపురనేని రామస్వామి, ఒక్కో పెరియార్.. ఒక్కో శంబూకుడు... ఒక్కో సత్యకామ జాబాలి.. కాచుకోండి... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ముందు యుగం దూతలు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top