Translate

  • Latest News

    7, ఏప్రిల్ 2020, మంగళవారం

    నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు...


    ఇన్నాళ్లు ఈ ప్రపంచానికి నేనే అధిరాజునని, ఈ భూగోళంలో ఉన్న ఏ దేశాధినేత అయినా నాకు పాదాక్రాంతం కావాల్సిందేనని అహంకారంతో...కన్నూ, మిన్నూ గానక విర్రవీగిన అమెరికా ఇప్పుడు కరోనా దెబ్బకు నిస్సహాయురాలై బేల చూపులు చూస్తోంది. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేల కూలినట్టు... అయింది కరోనా దెబ్బకు అమెరికా పరిస్థితి... ఇన్నాళ్లు నేనే నెంబర్ 1 అని చెప్పుకున్నదంతా అది వాపే కానీ... బలుపు కాదని తేలిపోయింది. గ్యాస్ తో ఊదిన అమెరికా గాలిబుడగ వినీలాకాశంలో హొయలు పోతుంటే ఆహ...ఓహో అని మురిసిపోయిన వారంతా... ఒక్క చిన్నకరోనా  సూదితో పొడవగానే ఆ గాలి బుడగ ఫట్ మని పేలిపోయింది. ఇప్పటిదాకా ప్రదర్శించింది అంతా మేకపోతు గాంభీర్యమేనని బట్టబయలు అయింది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా రానున్న కొద్ధి  వారాల్లోనే అమెరికాలో కరోనా కేసులు 10 లక్షలకు చేరుకుంటాయని, సుమారు లక్ష నుంచి 2 లక్షల వరకు మృతులు ఉండవచ్చని ప్రకటించారు. అంతే కాదు ముందు చూపుతో శవాల కోసం లక్ష సంచులు ఆర్డర్ కూడా చేశారంటే అమెరికాలో పరిస్థితి వారి చేయి దాటి పోయిందని చెప్పకనే చెప్పినట్తు అయింది.
    క్యూబా హీరో... అమెరికా జీరో...
    ఇన్నాళ్లు హీరోగా చెలామణి అయిన  అమెరికా ఇప్పుడు జీరో అని స్పష్టం అయింది. అమెరికా పొరుగున ఉన్న ఒక చిన్న దేశం క్యూబా ఇపుడు ప్రపంచానికే హీరో అయింది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు తమ దేశానికి వైద్యులను పంపమని క్యూబాను వేడుకుంటున్నాయి. కేవలం ఒక కోటి పదిహేను లక్షల జనాభా మాత్రమే ఉన్న అతి చిన్న దేశం క్యూబా ఒక్కటే ఈ ప్రపంచంలో ఇప్పటివరకు అమెరికాకు దాసోహం అనకుండా స్వతంత్రంగా వ్యవహరించింది. క్యూబాను లొంగదీసుకోవడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు. క్యూబాను వాణిజ్య పరంగా వెలి వేసి ఆంక్షలు పెట్టింది. ప్రపంచమంతా వెలి వేసినా క్యూబా తట్టుకుని నిలబడింది. ఇందుకు ప్రధాన కారణం ఆ దేశ విప్లవానికి సారధ్యం వహించిన ఫెడరల్ కాస్ట్రో, చేగువేరా... వారు ఆ దేశ ప్రజల్లో నింపిన స్ఫూర్తి. కాస్ట్రో పై అమెరికా 638 సార్లు హత్యా ప్రయత్నం చేసి విఫలం అయింది. క్యాస్ట్రో 46 ఏళ్ల పాటు క్యూబాకు అధ్యక్షుడిగా ఉండి  ఆ దేశాన్ని సర్వ సత్తాక  దేశంగా తయారు చేయడంలో కీలక పాత్ర వహించాడు. ముఖ్యంగా ఆ దేశ ఆరోగ్య పాలసీ ఇప్పుడు ప్రపంచానికి అంతటికి ఆదర్శం అయింది. ఆ దేశంలో ప్రతి వంద మందికి ఒక వైద్యుడు ఉంటాడు. ఆ దేశంలో ప్రైవేట్ హాస్పటల్స్ ఉండవు... ప్రజల ఆరోగ్యం అంతా ప్రభుత్వమే ఉచితంగా చూసుకుంటుంది. దీంతో అక్కడి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా ఉంటుంది. చైనాలో కరోనా కట్టడి చేసిన విషయంలో కూడా క్యూబా వైద్యుల ఘనతే అని చెబుతున్నారు. ఇలాంటి వైరస్ లను అరికట్టడానికి క్యూబాలో వారు తయారుచేసుకున్న మందుని వాడి కరోనా అదుపు చేశారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ క్యూబాను వారి వారి దేశాలకు రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఇంత జరిగినా చింత చచ్చినా పులుపు చావని అమెరికా మాత్రం క్యూబా వైద్యులను ఆహ్వానించకపోవడం గమనార్హం... సో ఇప్పుడు అమెరికా జీరో..క్యూబా హీరో అన్నది సుస్పష్టమైనట్టే కదా... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top