Translate

  • Latest News

    12, జులై 2018, గురువారం

    లోకేష్ తో చంద్రబాబుకు తిప్పలు తప్పవా..?


    సుపుత్రుడు లోకేష్ బాబుతో చంద్రబాబుకు తిప్పలు తప్పేటట్టు లేవు పాపం... పార్టీలో చంద్రబాబుకు సమాంతరంగా మరో వర్గాన్ని చేరదీస్తున్న లోకేష్ బాబుతో చంద్రబాబుకు తలనొప్పి తప్పదు. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉండి, ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారంతా చంద్రబాబు వర్గంలో ఉండగా.. పార్టీలో కొత్తగా చేరిన వారు వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం, పదవుల కోసం లోకేష్ బాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరంతా నోట్లకట్టలతో లోకేష్ బాబును ప్రసన్నం చేసుకుంటున్నారని వినికిడి. దాంతో లోకేష్ ఆటోమాటిక్ గా వారికి సపోర్ట్ గా మాట్లాడక తప్పదు. నిన్న కర్నూలు పర్యటనలో అదే జరిగింది. కర్నూలులో మైనార్టీ మహిళలతో ముఖాముఖీ కార్యక్రమంలో మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ కి ఎస్.వి.మోహన రెడ్డి, ఎం.పీ గా బుట్టా రేణుక పోటీ చేస్తారని ఏకంగా అభ్యర్ధులను ప్రకటించేశారు. అది విన్న రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ షాక్... ఆ తర్వాత అన్న కాంటీన్ ప్రారంభోత్సవంలో వెంకటేష్ మాట్లాడుతూ లోకేష్ ప్రకటనపై అగ్గి మీద గుగ్గిలమై పోయారు. ఆయన ఎవరు అభ్యర్థులను ప్రకటించడానికి... ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాదు... ముఖ్యమంత్రి కాదు.. ఆయన ఎలా ప్రకటిస్తారు... అయినా అసలు ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులను ప్రకటించడం ఏమిటి... తెలుగుదేశం పార్టీలో తెల్లారి బి.ఫారం ఇస్తారంటే ముందు రోజు అర్ధరాత్రి అభ్యర్థులను ప్రకటిస్తారు. సర్వే చేసిన తర్వాత ముందుకు పోతామని చంద్రబాబు నాతో చెప్పారు. ఈ విషయం మీద చంద్రబాబు చెప్పిన తర్వాతే నేను స్పందిస్తా... అని అన్నారు. 
    అంతం.... కాదిది... ఆరంభం... ముందుంది ముసళ్ల పండగ... 
    ఇది అంతం కాదు... ఆరంభం మాత్రమే... కర్నూలు జిల్లాలో మొదలైన ఈ రగడ ముందు ముందు ప్రతి జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ కి ఇదే పరిస్థితి ఎదురుకానుంది. ప్రతి నియోజకవర్గం లోనూ ప్రస్తుతం ఉన్న ఎం.ఎల్.ఏ లకు పోటీగా ఆయా స్థానాల్ని ఆశిస్తున్న వారు దొడ్డి దారిలో లోకేష్ బాబును ప్రసన్నం చేసుకుని ఆయన ప్రాపకం పొందుతున్నారు. వీరంతా భవిష్యత్తులో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారని, ఇక్కడ లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతారని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో తెలియకుండానే లోకేష్ బాబు వర్గం ఒకటి తయారయింది. ఈ వర్గంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తల నొప్పి తప్పదు. అయితే అపర చాణిక్యుడు అయిన చంద్రబాబు ఇటువంటి సమస్యలు పెద్ద లెక్కేమీ కాదనుకోండి... ఏదేమైనా కాస్త ఇబ్బందే మరి...  
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: లోకేష్ తో చంద్రబాబుకు తిప్పలు తప్పవా..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top