Translate

  • Latest News

    6, జులై 2018, శుక్రవారం

    ఇద్దరూ కలసి రాష్ట్రాన్ని ముంచారు


    ప్రధాన మంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలసి నూతన రాష్ట్రమైన ఏ.పీ కొంప ముంచారు. ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కారు. ఏ.పీ.కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చేసింది. నిన్నటిదాకా కేంద్రంతో అధికారం పంచుకుని, హోదా వద్దు... ప్యాకేజీ ముద్దు అని భజన చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్ని ధర్మ దీక్షలు చేసినా చేసిన పాపం పోతుందా.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. నిజమే ప్యాకేజీలో ఇస్తామన్నవి అన్నీ ఇవ్వకుండానే... అన్నీ ఇచ్చేశాం... అని కేంద్రం ఏ.పీ. పై సుప్రీం కోర్ట్ కు ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొనడంతో రాష్ర్త ప్రజలు భగ్గుమంటున్నారు. అసలు కేంద్రానికి అంత అలుసు ఇచ్చిందెవరు... చంద్రబాబు కాదా... వాళ్ళ అడుగులకు మడుగులొత్తి... వంగి...వంగి దండాలు పెట్టి... వారితో కలసి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం పంచుకుని... మంత్రి పదవులు వెలగబెట్టి.. ఇప్పుడు కుయ్యో...మొర్రో... అంటే ఏం లాభం. కేంద్రం మాటలు నమ్మి మోసపోయాం... అని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు.. మాట్లాడితే 40 ఏళ్ల అనుభవం..దేశం లో అందరికన్నా  నేనే సీనియర్ రాజకియ నాయకుడిని...అంటూ  గొప్పలు చెప్పుకునే బాబు గారు నేను మోసపోయాను అంటే దానికి అర్థమేమిటి... నీ అనుభవం ఎందుకూ పనికిరానట్టేగా... నువ్వు అనుభవశాలివి...నువ్వు అయితేనే రాష్ట్రానికి న్యాయం చేయగలవావని నమ్మి నిన్ను ఎన్నికల్లో గెలిపిస్తే... నువ్వు మోసపోవడం కాదు...నిన్ను నమ్మి జనం మోసపోయారు. ఇప్పుడు చేతులు కాలాక మళ్ళీ నేను మోసపోయానంటూ... దీక్షలు చేస్తూ రాష్ట్ర ప్రజలను ఇంకోసారి మోసం చేద్దామనేనా... మోడీ, చంద్రబాబు లకు ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలు తమ చెంపలు తాము గట్టిగా వాయించుకోవాలి. ఈ ఇద్దరినీ... ఆ రెండు పార్టీలను ప్రజలు వచ్చే ఎన్నికల్లో బహిష్కరించాలి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఇద్దరూ కలసి రాష్ట్రాన్ని ముంచారు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top