Translate

  • Latest News

    16, ఆగస్టు 2019, శుక్రవారం

    జుట్టుకు రంగు వేస్తున్నారా


    తలకు రంగేసుకోవడం ఇప్పుడు చాలా మందికి అలవాటైన పనిగా మారింది. అయితే హెయిర్‌ డై రెగ్యులర్‌గా వేసుకోవడం రకరకాల అలర్జీలకూ దారితీస్తోంది. అలర్జీ వల్ల ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. హెయిర్‌ డైస్‌లో అమ్మోనియా, ప్రోప్లియన్‌, గ్లైకోల్‌ మరియు పిపిడి వంటి కెమికల్స్‌ ఉండటం వల్ల అవి అలర్జీలకు కారణమవుతున్నాయి దీనివల్ల తలలో దురద, బర్నింగ్‌ వంటి లక్షణాలు కలుగుతుంటాయి. చెవులు, చేతులు, ముఖం మరియు తలలో కూడా రాషెస్‌ ఏర్పడతాయి. కొన్ని పరిస్థితుల్లో హెయిర్‌ డై వాడే వారిలో శ్వాససంబంధిత సమస్యలూ వస్తాయి. అందుకు వెంటనే మెడికల్‌ ట్రీట్మెంట్‌ తీసుకోవడం చాలా అవసరం. హెయిర్‌ డై వేసుకొన్న ఒకటి రెండు రోజులకల్లా అలర్జిక్‌ రియాక్షన్‌ వచ్చినా భయపడకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. 
    నిమ్మరసంలో ఉండే యాంటీ సెప్టిక్‌ గుణాలు హెయిర్‌ కలరింగ్‌ వల్ల వచ్చే అలర్జీ లక్షణాలను నివారించడంలో బాగా తోడ్పడతాయి. నిమ్మరసాన్ని నీటిలో కలిపి, తలకు అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది తలలో అలర్జీలను, దురదను నివారించడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. 
    బేకింగ్‌ సోడా వాటర్‌ కూడా తలలో వచ్చే అలర్జీలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. బేకింగ్‌ సోడాను కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. 
    చమమోలి టీలో కొన్ని ఐస్‌ ముక్కలు వేసి, ఈ నీటితో తలస్నానం చేయాలి. లేదా తలకు పట్టించి, 10 నిముషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల తలలో ఇన్‌ఫ్లమేషన్‌, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. 
    అలోవెర జెల్‌ అలర్జిక్‌ లక్షణాలను నివారించడంలో బాగా తోడ్పడుతుంది. ముఖ్యంగా హెయిర్‌ డై వల్ల వచ్చే అలర్జీలను నివారిస్తుంది. తలలో దురద, హెయిర్‌ డ్రైగా మారడం వంటి లక్షణాలను నివారిస్తుంది. తలకు అలోవెర జెల్‌ను రాసి పావుగంట తర్వాత తలస్నానం చేయాలి. 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జుట్టుకు రంగు వేస్తున్నారా Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top