Translate

  • Latest News

    20, ఏప్రిల్ 2020, సోమవారం

    కెనడాలో కాల్పులు ... 16 మంది మృతి


    కెనడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా పోలీస్ అధికారి సహా 16 మందిని హతమార్చాడో దుండగుడు. ఈ ఘటన నోవా స్కోటియాలో జరిగింది. పోలీసు అధికారిలాగా మారువేషంలో ఉన్న ఓ ముష్కరుడు 16 మందిని హతమార్చాడు.. ఇది దేశ చరిత్రలో ఘోరమైన దాడిగా ప్రభుత్వం భావిస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే అనుమానిత షూటర్ కూడా చనిపోయాడని అధికారులు తెలిపారు. నోవా స్కోటియా లోని హాలిఫాక్స్ కు ఉత్తరాన 60 మైళ్ళు దూరంలో ఉన్న పోర్టాపిక్‌ పట్టణంలో మృతదేహాలను వెలికితీశారు.

    కాల్పులు జరిపిన వ్యక్తి గాబ్రియేల్ వోర్ట్‌మన్ (51) గా పోలీసులు గుర్తించారు, అతను పోర్టాపిక్‌లో తాత్కాలికంగా నివసిస్తున్నట్లు భావిస్తున్నారు. అతను కాల్పుల సమయంలో పోలీసు యూనిఫాం ధరించి తన కారును పోలీస్ వాహనం లాగా తయారు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇక అతను ఎందుకు ఇలా చేశాడు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

    .
    గాబ్రియల్ ఆర్సీఎంపీ గ్యాస్ స్టేషన్‌ల‌ోకి రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు అధికారిగా ప్రవేశించారు. తర్వాత విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. . ఇక్కడ ఇదివరకు జరిగిన దారుణ హత్యలకు కూడా గ్యాబ్రియల్ కారణం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


    చనిపోయిన వారిలో మహిళ పోలీసు అధికారి కూడా ఉన్నారు. హెడి స్టీవెన్ సన్ అనే మహిళ.. గత 23 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఇద్దరు చిన్నారులు ఉండగా.. వారు తల్లిని కోల్పోయారు. గ్యాబ్రియల్ ఎందుకు దాడిచేశారనే అంశం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కాల్పులు జరగడంతో వెంటనే అక్కడికీ చేరుకున్నామని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
    గాబ్రియల్ గ్యాస్ స్టేషన్ వద్దకు పోలీసు దుస్తుల్లో, పోలీసులు కారులో వచ్చాడని.. కానీ తర్వాత పోలీసులు జరిగింది వివరించారు. సిల్వర్ చెవల్రెట్ ఎస్‌యూవీలో వచ్చాడని పేర్కొన్నారు. కానీ అతను ఆర్సీఎంపీ ఉద్యోగి కూడా కాదని వివరించారు. కెనడాలో కాల్పులపై ప్రధాని జస్టిన్ ట్రూడ్ సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలిసి తన గుండె బద్దలవుతోందని ప్రకటనలో తెలిపారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కెనడాలో కాల్పులు ... 16 మంది మృతి Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top