Translate

  • Latest News

    17, ఏప్రిల్ 2020, శుక్రవారం

    మోకాలికి బట్టతలకు ముడిపెడుతున్న చంద్రబాబు


    ప్రపంచమంతా క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్‌లో ఉంది. ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మై త‌మ భ‌విష్య‌త్తు ఏమిటా అని ఆందోళ‌న చెందుతున్నారు. మేధావులు, ప్ర‌తిప‌క్ష‌నాయ‌కులు, నిపుణులు క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వాల‌కు స‌ల‌హాలు ఇస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రం కరోనా రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌తి విప‌త్క‌ర ప‌రిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకొనే స‌త్తా ఉన్న ఏకైక నాయ‌కుడు టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు క‌రోనా స‌మ‌యంలో ప‌రిస్థితిని తనకు అనుకూలంగా  మార్చుకోవ‌టానికి సిద్ద‌మ‌య్యారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న అనుకూల మీడియా ఇప్ప‌టికే ముంద‌స్తు ప్ర‌ణాళిక సిద్ధం  చేసింది. 
    విపత్కర కాలంలో ప్రతిపక్షం దీక్షలా... 
    విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఏ పార్టీ, నాయ‌కుడైనా ఆ విప‌త్క‌ర ప‌రిస్థితి నుంచి ప్ర‌జ‌ల‌ను ఎలా బ‌య‌ట‌కు ప‌డ‌వేయాలో ఆ దిశగా  ప్ర‌భుత్వానికి నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు, స‌ల‌హాలు చేస్తారు. త‌మ పార్టీ త‌రుపున ప్ర‌జ‌ల‌కు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తారు. ఏపీలో ప‌రిస్థితి మాత్రం  ఇందుకు భిన్నంగా ఉంది. అధికారంలో ఉన్న వైసీసీ ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై భిన్నాభిప్రాయాలు ఉండ‌వ‌చ్చు. అయితే ఈ ప‌రిస్ఠితిని అధిగ‌మించ‌టానికి ప్ర‌తి ప‌క్షంగా టీడీపీ స‌ల‌హాలు సూచ‌న‌లు అంద‌జేయ‌వ‌చ్చు. కాని ఇప్పుడు టీడీపీ ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌ట‌మే వివాదానికి కార‌ణ‌మవుతోంది. ప్రభుత్వం;పై ఆరోపణలు గుప్పించడమే కాక తమ నాయకులతో దీక్షలు చేయించడం మరీ విడ్డూరం. 
    కరోనా కల్లోలంలోనూ రాజకీయం తగునా... 
    వైసీసీ ప్ర‌భుత్వాన్ని ఈ ప‌రిస్థితుల్లో ఇరుకున పెట్టాల‌ని టీడీపీ భావిస్తుందా అంటే ... నిజ‌మే అని స‌మాధానం వ‌స్తుంది. ఇందుకు సంబంధించి టీడీపీ ఒక వ్యూహం ప్ర‌కారం ముందుకు క‌దులుతోంది. క‌రోనా కేసుల సంఖ్య విష‌యంలో ప్ర‌భుత్వం త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తుంద‌న్న‌ది టీడీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఇందుకు విశాఖప‌ట్నంలో కేసులు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు చూపించి ,గుంటూరులో ఎక్కువ కేసులు న‌మోదు అయిన‌ట్లు చూపుతున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా విశాఖకు రాజ‌ధానిని మార్చాల‌నే ఉద్దేశంతో విశాఖ‌లో  కరోనా కేసులు త‌క్కువ చేసి చూపుతున్నార‌ని ఆరోపించడం మోకాలికి బట్టతలకు ముడిపెట్టినట్టు ఉంది.  ఇందుకు త‌గ్గ‌ట్టుగానే  చంద్ర‌బాబు అనుకూల మీడియాలో వరుస క‌థ‌నాలు వండి వారుస్తున్నారు. మరోపక్క గుంటూరులో వెయ్యి కేసులు నమోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ అనుకూల మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.
    గోబెల్ ప్రచారంలో టీడీపీ 
    ఈ విధమైన కధనాల ద్వారా ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు రేకిత్తించ‌టం, భ‌యందోళ‌న‌ల్లో ఉన్న‌ ప్ర‌జ‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌టం త‌ద్వారా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తను పెంచ‌టం ఇలాంటి అంత‌ర్గ‌త ఎజెండా ఉంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ప్ర‌జ‌ల ఉద్వేగాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌టం ఇప్ప‌టిది కాదు... .ప్ర‌పంచ నియంత హిట్ల‌ర్ ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించాడు. ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు రేకెత్తించ‌టం,వారి భావోద్వేగాల‌ను తాము అనుకున్న విధంగా మ‌ల్చుకోవ‌టంతో హిట్ల‌ర్ అప్ప‌ట్లో విజ‌యం సాధించాడు. ఇప్ప‌టికీ అనేక‌మంది రాజ‌కీయ‌నాయ‌కులు ఇదే విధానాన్ని ఫాలో అవుతుంటారు. చంద్ర‌బాబు విష‌యానికే వ‌స్తే ఇప్ప‌టికే ఏపీలో క‌రోనా కేసులు ప్ర‌భుత్వం దాచిపెడుతుంద‌న్న విష‌యాన్ని ప‌దేప‌దే చెప్పి  గోబెల్ ప్ర‌చారం చేయ‌టంలో  విజ‌యం సాధించాడు. ఇందుకు టీడీపీ మీడియా కూడా కీల‌క పాత్ర పోషించింది. ఇక త‌రువాత భ‌యాందోళ‌న‌ల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను త‌మ‌ వైపునకు మ‌లుచుకోవ‌టం, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌తను వీలైనంత‌గా పెంపొందించ‌టం.... ఇప్పుడు ప్ర‌తిప‌క్షం ఇదే ప‌నిలో ఉంది. 
    తన పని తాను  చేసుకుపోతున్న జగన్...
    ప్రతిపక్షాల విమర్శలను ఏ మాత్రం  పట్టించుకోకుండా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన పని తానూ కామ్ గా చేసుకుపోతున్నారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు త్వరితగతంగా చేయడానికి సౌత్ కొరియా నుంచి లక్ష కిట్లు తెప్పించారు. ఈ కిట్లతో కేవలం పది నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. ఇప్పటికే వైజాగ్ లోని మెడ్ టెక్ లో తయారు చేసిన కిట్లు 55 నిమిషాల్లో ఫలితాన్ని ఇస్తే ఇప్పుడు సౌత్ కొరియా కిట్ల ద్వారా  కేవలం 10 నిమిషాల్లోనే ఫలితం  వెల్లడి అవడంతో కరోనా నియంత్రణ దిశలో రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానములో ఉండే అవకాశం ఉంది. అయితే జగన్ ఒక వైపు కరోనా కట్టడికి సమర్ధవంతంగా చర్యలు తీసుకుంటూనే...  మ‌రోవైపు ప్ర‌జ‌ల‌తో మైండ్ గేమ్ అడుతున్న ప్రతిపక్ష పార్టీల‌కు స‌రైన స‌మాధానం చెప్పాల్సిన అవసరం  కూడా ఉంది. లేదంటే...  క‌రోనాపై విజ‌యం సాధించినా, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భించ‌టం క‌ష్ట‌మౌతుంది. ఈ రెండు అంశాల‌ను బ్యాలెన్స్ చేసుకొని జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ‌తారో వేచి చూద్దాం. 










    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మోకాలికి బట్టతలకు ముడిపెడుతున్న చంద్రబాబు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top