Translate

  • Latest News

    19, ఏప్రిల్ 2020, ఆదివారం

    లాక్‌డౌన్‌తో ఇంటికి ప‌రిమిత‌మయ్యారా.?... ఇంటిలో ఇలా గ‌డ‌పండి.




    ప్ర‌ధాని మోడీ క‌రోనాపై యుద్దాన్ని తీవ్ర‌త‌రం చేయ‌నున్నారు. ఇందులో భాగంగానే ఇప్ప‌టికే 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు పేర్కొన్నారు.అంటే మ‌రో కొన్ని రోజులు ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వాల్సిన అవ‌సరం ఏర్ప‌డింది. క‌నీసం ఒక్క గంట స‌మ‌యం కూడా ఇంటితో, కుటుంబ‌స‌భ్యుల‌తో మ‌మేకం కాలేని వారికి ఈ ర‌కంగా అరుదైన అవ‌కాశం క‌లిగింది. పెద్ద‌ల‌తో, భార్య‌, పిల్ల‌ల‌తో ఇళ్ల‌లోనే ఉండటంతో ఆప్యాయ‌త‌ల‌ను పంచుకోవ‌టానికి, ప్రేమ‌ను,అనురాగాన్ని పెంపోందించుకోవ‌టానికి లాక్‌డౌన్ ఒక అవ‌కాశం క‌ల్పించింది. మ‌రి ఇళ్ల‌లో ఎలా గ‌డపాలి.. ఏ విధంగా ఉండ‌ల‌న్న దానిపై ఒక స‌మ‌గ్ర ల‌క్ష్యాన్ని ఏర్ప‌రుచుకుంటే ప్ర‌తి దినం అనందమే.

    ఇళ్ల‌లో పిల్ల‌ల‌తో గ‌డిపే క్ర‌మంలో మీ జ్ఞాప‌కాల‌ను పంచుకోవ‌చ్చు. మీ స్నేహితులు వారితో మీ అనుబంధాలు పంచుకోవ‌చ్చు. మీ ఇంట్లో భార్య‌కు, పిల్ల‌ల‌కు మీరే హీరో అన్న‌విష‌యం మ‌రిచిపోరాదు. ఈ క్ర‌మంలో మీరు చెప్పే ప్ర‌తి విష‌యం మీతో కుటుంబ అనుబంధాల‌ను ద‌గ్గ‌ర చేస్తుంది. వంట‌లో భార్య‌కు స‌హాయ‌ప‌డ‌వ‌చ్చు. మీకు తెలిసిన వంట‌ల రుచిని కుటుంబానికి తెలిప‌వ‌చ్చు.


    చాల‌కాలంగా ఇంట్లో వ‌స్తువులు,పాత‌వి పేరుకుపోయి ఉంటాయి. ప‌ని ఒత్త‌డిలో చేద్దాం.. చూద్దాం అని వాయిదా వేస్తుండ‌వ‌చ్చు. వాటిప‌ని ప‌ట్టండి. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవ‌చ్చు. దేశంలో ని బంధుమిత్రులు ఎక్క‌డి వారు అక్క‌డ ఒక చిన్న ప‌ల‌క‌రింపు కోసం ఎదురు చూస్తుండ‌వ‌చ్చు. ఒక్క సారి ప‌ల‌క‌రించి వారి యోగ‌క్షేమాలు క‌నుక్కోండి. క‌లిసి భోజ‌నం చేసి ఏన్నాళ్లు అవుతుందో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోజ‌నం చేయండి.మీ ద‌గ్గ‌ర చ‌ద‌వ కుండా ఉన్న పుస్త‌కాల దుమ్ముదుల‌పండి. ఆ పుస్త‌కాలు చ‌ద‌వ‌వండి. ఇలా ఇంటికే ప‌రిమిత‌మై కుటుంబ బంధాల‌ను ఇముడింప చేసుకోవ‌చ్చు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: లాక్‌డౌన్‌తో ఇంటికి ప‌రిమిత‌మయ్యారా.?... ఇంటిలో ఇలా గ‌డ‌పండి. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top