Translate

  • Latest News

    26, ఏప్రిల్ 2020, ఆదివారం

    ప్రజలు నడిపిస్తున్న యుద్ధం ఇది ..


    మన్ కీ బాత్ లో ప్రధాని 
    ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రజలతో మాట్లాడారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కీలక సందేశాన్ని వినిపించారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ లో జరుగుతున్న విషయాలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రజలే సైనికులుగా మారి కరోనాపై యుద్ధం చేస్తున్న గొప్ప సందర్భం ఇక్కడ ఆవిష్కృతమైందని ప్రధాని అన్నారు. ''ప్రజలే ముందుండి నడిపిస్తున్న ఈ యుద్ధంలో పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం వాళ్లను అనుసరిస్తున్నారంతే ''అని తెలిపారు.
    చప్పట్లు, దీపకాంతులే స్ఫూర్తి : 
    ''దేశం నుంచి పేదరికాన్ని తరిమేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలోనే కరోనా మహమ్మారి వచ్చిపడింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మనకు.. లాక్ డౌన్ విధించడం తప్ప మనకు వేరే మార్గం లేనేలేదు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ సిపాయిలా మారి పోరాడుతున్నారు. ఈ 'పీపుల్ డ్రివెన్ వార్'పై ప్రపంచమంతటా చర్చ జరిగి తీరుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ ప్రజలు ఒక్కటయ్యారు. పేదలకు అన్నం పెట్టడం దగ్గర్నుంచి రేషన్ సరుకుల పంపకం దాకా అన్ని చోట్లా లాక్ డౌన్ పక్కాగా అమలవుతోంది. యావత్ దేశం ఒకే దిశలో, ఒకే లక్ష్యతో ముందుకు వెళుతున్న సందర్భమిది. చప్పట్లు, దీపకాంతులు మనకు స్ఫూర్తి, ప్రేరణ ఇస్తున్నాయి.
    మంచి తలంపే ఆయుధం :
    కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అన్నదాతలు పంటపొలాల్లో పనిచేస్తున్నారు. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దనే గొప్ప మనసు వారిది. ఇంకొందరేమో ఇంటి కిరాయిలు మాఫీ చేస్తున్నారు, మరికొందరు తమ పెన్షన్ డబ్బుల్ని పీఎం కేర్స్ కు విరాళంగా ఇస్తున్నారు. కూరగాయల్ని పంచేవాళ్లు కోకొల్లలైతే ,  మాస్కుల తయారు చేస్తున్నవాళ్లూ మరెందరో. ఓ స్కూల్ బిల్డింగ్ లో క్వారంటైన్ లో ఉన్న వలస కూలీలు  ఆ బడికి రంగులు వేసి అద్భుతంగా తీర్చిదిద్దిన దృశ్యాన్ని మనందరం చూశాం. ఎలాగైనాసరే పొరుగువాళ్లకు సాయపడాలన్న మంచి తలంపు ఉందే.. కరోనాపై యుద్ధంలో ఇదే మన ఆయుధం.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ప్రజలు నడిపిస్తున్న యుద్ధం ఇది .. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top