Translate

  • Latest News

    11, జులై 2020, శనివారం

    ‘బుట్టబొమ్మ’ వీడియో రికార్డు


    టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా నటించి మెప్పించిన సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌ని నమోదు చేసింది. ఈ సినిమా కంటే... ఇందులో ఆడియో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కొడుతూ ఉంది కూడా.  ఆల్బమ్‌లోని ప్రతీ పాటకు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘రాములో రాముల’, ‘బుట్టబొమ్మ’ పాటలు జనాల్లోకి విపరీతంగా ఎక్కేశాయి. అలాగే విజువల్స్ పరంగా ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ వరల్డ్ వైడ్ క్రేజ్‌‌ని అందుకోవడమే కాకుండా తెలుగులో కనివినీ ఎరుగని రికార్డ్‌ను క్రియేట్ చేసింది. బన్నీ డ్యాన్స్, పూజా అందంతో కూడిన అభినయం వెరసి పాటను చూపరులు మళ్లీ మళ్లీ చూసేలా వీక్షకులను తెగ మెస్మరైజ్ చేసేస్తుంది. రికార్డ్‌ల మీద రికార్డ్ లను క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్‌లో ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్‌కు రికార్డ్ వ్యూస్ వస్తుండటం విశేషం. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ‘బుట్టబొమ్మ’ వీడియో రికార్డు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top