Translate

  • Latest News

    25, ఆగస్టు 2017, శుక్రవారం

    టాయ్‌లెట్‌’ రెండు వారాల్లోనే రూ.100 కోట్లు


    ‘టాయ్‌లెట్‌’ రెండు వారాల్లోనే రూ.100 కోట్లు

    సామాజిక అంశం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం రెండు వారాల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది. అయితే బాహుబలి అంత స్థాయిలో కాకపోయినా ఆ సినిమా తర్వాత హిట్టైన చిత్రం మాత్రం ‘టాయ్‌లెట్‌’ అని అంటున్నారు సాజిద్‌. బాలీవుడ్‌లో బాహుబలి తర్వాత వచ్చిన ఏ చిత్రాలు ఆశించినంత స్థాయిలో ఆడలేదని ఈ నేపథ్యంలో అక్షయ్‌ చిత్రం బాక్సాఫీస్‌ను ఆదుకుందని పేర్కొన్నారు.
    సాజిద్‌ ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ కాంబినేషన్‌లో పదేళ్ల క్రితం ‘హేయ్‌ బేబీ’చిత్రం వచ్చింది. త్వరలో అక్షయ్‌తో ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రం తెరకెక్కించనున్నట్లు సాజిద్‌ అన్నారు. ఈ మధ్యకాలంలో అక్షయ్‌ సినిమాలపై యువతకున్న ఆలోచనా విధానం మారిందని.. ఆయన సినిమా వస్తోందంటేనే అందులో వినోదం, సందేశం కచ్చితంగా ఉంటుందని యువత అనుకుంటోందని సాజిద్‌ తెలిపారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: టాయ్‌లెట్‌’ రెండు వారాల్లోనే రూ.100 కోట్లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top