Translate

  • Latest News

    25, ఆగస్టు 2017, శుక్రవారం

    సంతోషం సగం బలం


    సంతోషం సగం బలం 

    ఉల్లాసంగా, సంతోషంగా గడిపేవారు సహజంగా ఆరోగ్యంగానూ ఉంటారు. దీనికి సానుకూల దృక్పథం ఒక్కటే కాదు.. అన్నిపనుల్లోనూ చురుకుగా పాల్గొనటం, మంచి ఆహారం తీసుకోవటం కూడా కారణమే. ఇలాంటివారు పక్కవారి ఆరోగ్యానికీ.. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడతారు తెలుసా? ప్రతిదానికీ చింతించే భాగస్వామి గలవారితో పోలిస్తే.. ఆనందంగా, సంతోషంగా ఉండే భాగస్వామి గలవారు 34% ఎక్కువ ఆరోగ్యంగా ఉంటున్నట్టు మిషిగన్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం. వీరికి శారీరక బాధలు తక్కువగా ఉంటున్నట్టు.. మరింత తరచుగా వ్యాయామం, శారీరకశ్రమలు చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు మరి. వ్యక్తిగత సంతోషం, ఇతర జీవితానుభవాలను పక్కనపెట్టి చూసినా ఈ ప్రభావం కనబడుతుండటం గమనార్హం. దీనికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. ఒకటి- ఆనందంగా ఉండేవారు తమ భాగస్వామిని బాగా చూసుకోవటం. భాగస్వామి భావోద్వేగాలను పంచుకుంటూ.. సమయానికి మందులు వేసుకునేలా చేయటం వంటి చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తుంటారని పరిశోధకులు చెబుతున్నారు. రెండోది- భాగస్వామి ఏదైనా బాధపడుతున్నప్పుడు వారికి భరోసా ఇస్తూ దాన్నుంచి తేలికగా బయటపడేలా తోడ్పడుతుండటం. ఇది వారి భాగస్వామి ఒత్తిడి, ఆందోళన వంటి వాటికి లోనవకుండా కాపాడుతోందనీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే.. ఈ విషయంలో భార్యాభర్తలనే తేడా లేకపోవటం. అంటే భార్య ఆనందం భర్త పైన, భర్త ఆనందం భార్య పైన ప్రభావం చూపుతున్నాయన్నమాట

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సంతోషం సగం బలం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top