మా గురించి ......
భిన్న మతాలు, భిన్న కులాలు, విభిన్న సంస్కృతులతో ఉన్న భారత దేశంలో భిన్న స్వరాలు
వినిపించటం సహజాతి సహజం. కాని పాలకుల వైఖరి ఏకధ్రువపాలనగా సాగుతోంది. నాలుగు పడగల హైందవ
నాగరాజు తల ఊపే నాదస్వరం తప్ప మ రే స్వరం వినిపించటానికి వీలులేదంటూ అప్రకటిత నిషేధాజ్ఞలు
అమలు చేస్తున్నారు.ఏడు రంగులు కలిస్తే ఇంద్రధనస్సు అయినట్లు, సప్తస్వరాలు కలిస్తేనే
మనోల్లాస సంగీతమైనట్లు , భిన్న స్వరాలు వినిపిస్తేనే కదా భావప్రకటన స్వేచ్చ వికసిందేది.
స్వరం బయటకు రాకుండా అల్పసంఖ్యాక వర్గాల గొంతు వామన పాదంతో తొక్కిపెడుతుంటే అభ్యుదయ
వాదులంతా గొంతు పిక్కటిల్లేలా ఒక్కటే భిన్నస్వరాలు వినిపించే సమయం ఆసన్నమైంది. మాకంటూ
ప్రత్యేకించి ఏ వర్గంపైనో సమూహంపైనో ప్రత్యేకమైన ద్వేషం, ప్రేమలు లేవు.సమాజానికి మేలు
చేసే ఏ సమాచారమైనా మేము ప్రజలకు చేరువయ్యేలా చేస్తాం. ఈ క్రమంలో ఏమైనా తప్పలు జరిగితే
, తప్పడు సమాచారం పొరపాటున దొర్లినా సరిచేసుకోవటానికి సిద్దంగా ఉన్నాం. ఈ క్రమంలో మీ
సలహాలు, సూచనలు కోరుతున్నాం. మీ సలహాలు ,సూచనలు
మా మెయిల్ ......bhinnaswaralu@gmail.com కు పంపాలని కోరుతున్నాం.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి