Translate

  • Latest News

    23, ఆగస్టు 2017, బుధవారం

    అందుబాటులోకి కొత్త రూ.200 నోట్లు

    కొత్త రూ. 200 నోట్లు ఈరోజు నుంచి చలామణీ లోకి రానున్నాయి కొత్త రూ.200 నోట్లు దాదాపు ఈనెల చివరినాటికి లేదా సెప్టెంబర్ మొదట్లో అందుబాటులోకి వస్తాయని ముందుగా  ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.అయితే అనుకున్న సమయం కన్నా ముందుగానే శుక్రవారం నుంచి అందుబాటులోకి రా నున్నాయి 
    రూ.100, రూ.500 మధ్య ఎలాంటి డినామినేషన్ లేకపోవడంతో కొత్తగా తీసుకొస్తున్న రూ.200 నోట్లు విపరీతమైన డిమాండ్ ఉంటుందని భావించిన ఆర్బీఐ అందుకు తగ్గట్టుగానే కసరత్తు చేసినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా  200 కొత్త డినామినేషన్ నోట్లను రూ.50 కోట్ల మేర ముద్రించి... ఒకేసారి అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం 
    పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లకు తీవ్ర కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. రూ.2000 వేల డినామినేషన్ నోట్లను గుప్పిటపట్టిన బ్లాక్ మార్కెట్ దళారులు... తెచ్చిన నోట్లను తెచ్చినట్టు మాయం చేసేశారు. దీని కారణంగానే సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురైనట్టు ఆర్బీఐ గుర్తించింది. అందుకే ఈసారి భారీ మొత్తంలో రూ.200 కొత్త నోట్లు అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల సామాన్యులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుందని బ్యాకింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నల్లధనం, పన్ను ఎగవేతలు వంటి సమస్యలకు గుణపాఠం చెప్పేందుకే రూ.200 నోట్లు తీసుకొస్తున్నట్టు కనిపిస్తోంది.
    నరేంద్రమోడీ ప్రభుత్వం రూ .1,000 నిషేధం ప్రకటించినప్పుడు నవంబర్ నుంచి ప్రకటించిన నాలుగవ కొత్త నోటు ఇది.  కొత్త  రూ. 200 కరెన్సీ లో  సాంప్రదాయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిభించే విధంగా  సాంచి స్తూప యొక్క నమూనా.,మహాత్మా గాంధీ చిత్రం పొందు పరిచారు  కొత్త నోట్ 66mmX146mm పరిమాణంలో ఉంటుంది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అందుబాటులోకి కొత్త రూ.200 నోట్లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top