Translate

  • Latest News

    24, ఆగస్టు 2017, గురువారం

    సుప్రీం కోర్టు సంచలన తీర్పు

    సుప్రీం కోర్టు సంచలన తీర్పు 

    రైట్‌ టూ ప్రైవసీపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆధార్‌ ద్వారా వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘిస్తున్నారంటూ 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తేల్చిచెప్పింది. మొత్తం 9 మంది జడ్జీల బెంచ్‌ ఏకగ్రీవ తీర్పునిచ్చింది.

    భారత దేశంలో ఆధార్‌ను తప్పని సరి చేస్తూ.. దేశ పౌరుల సమాచారాన్ని ఆధార్ కోసం ప్రభుత్వం సేకరించిన విషయం తెలిసిందే. వేలిముద్రలు, కళ్లు, ముఖం వంటి వివరాలు ఆధార్‌లో నిక్షిప్తం అయి ఉంటాయి. బ్యాంకులు, ఇతరత్రా వ్యక్తిగత లావాదేవీలకు వేలిముద్రలనే విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ప్రయివేటు సంస్థలకు కూడా ప్రభుత్వం ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయిన విషయం తెలిసిందే. ఆధార్ వివరాలు బహిర్గతం చేయకూడదని, ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు ఇవ్వకూడదని 2015లో దాఖలైన పిటీషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. వ్యక్తిగత వివరాలు గ్యోపంగా ఉంచుకోవడం కూడా ప్రాథమిక హక్కుల కిందికే వస్తుందని తీర్పునిచ్చింది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సుప్రీం కోర్టు సంచలన తీర్పు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top