భిన్నస్వరాలు వినిపిస్తేనే కదా భావ ప్రకటన స్వేచ్ఛ వికసించేది.
Latest News, Breaking News, Live Andhra news from India and news headlines from around the world.
పందెం కోడి మాంచి ఊపుమీదుంది. ఈ కోడికి పందాళ్లనా, సవాళ్లున్నా మాంచి సరదా. వాస్తవానికి తనకు తానుగా సవాళ్లు విసరదు. గమ్మనుంది కదా అని అవతలి కోడి నోరు పారేసుకొని సవాళ్లు విసిరితే మాత్రం ఆ సవాల్ను స్పోర్తివ్గా స్వీకరిస్తుంది. అక్కడే నుంచే అసలు కథ మొదలౌతుంది.ఇక మాటలు మాని చేతలకు పనిచెప్తుంది. అవతలి కోళ్లు నోటి కూతలకు చేతులతో సమాధానం చెప్పి నోరు మూయిస్తుంది.మేనేజ్ మెంట్ స్కిల్స్ లో ఈ కోడికి సరితూగే పందంకోడి ప్రపంచంలో మరెక్కడా ఉండబోదని చెప్పటంలో ఎటవంటి అతియోశక్తి లేదు. క్రైసిస్ మే నేజ్ మెంట్ చేయటంతో దిట్ట. ' తివిరి ఇసుమున ఇసుమున తైలంబు తీయవచ్చు' అన్న పద్యాన్ని చిన్నప్పడు బాగా ఆకలింపచేసుకుందెమో కాని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదు అన్న చోట సర్వశక్తులు ఒడ్డి గెలిచి వస్తుంది. 2014లో అలాగే గెలిచి అందర్ని సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. మళ్లీ ఇప్పడు పోరు గడ్డ నంద్యాలలో ప్రత్యర్థి కోడిని మట్టి కరిపించింది. ఈ పందెం కోడి పేరు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదునుకుంటా. నోట్ : (కోడిపందాలలో నీతిసూత్రాలు కుదరవు. ఆ పందెమే అనైతికం. కాళ్లకు కత్తులు కట్టుకొని చేసే పోరాటం. గెలిచిన కోడే మొనగాడు.గమనించగలరు ) -- మానవేంద్ర
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి