Translate

  • Latest News

    28, ఆగస్టు 2017, సోమవారం

    టీడీపీకి నంద్యాల విజయమే కాకినాడ ఎన్నిక ప్ర‌చార అస్త్రం



    టీడీపీకి  నంద్యాల విజయమే కాకినాడ ఎన్నిక  ప్ర‌చార అస్త్రం


    నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలలో టీడీపీ ఘన విజయం సాధించిది . ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అంటే మంగళవారం   కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరగ నున్నాయి . అన్ని ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఫలితాలు వెల్లడించ కూడదన్నది  ఎన్నికల సంఘం పాటిస్తున్న సంప్రాదాయం . ఇందుకు భిన్నం గా ఈ సారి నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే నగరపాలక సంస్థ ఎన్నికలు జరగటం విశేషం  ఇదే విషయం పై . కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నంద్యాల ఉప‌ఎన్నిక‌ ఫ‌లితాన్ని వాయిదా వేయాల‌ని,నంద్యాల ఫలితం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌పై తీవ్రంగా ప్ర‌భావం చూపుతుందని పీసీసీ చీఫ్ ర‌ఘువీరా రెడ్డి   కోరినా ప్రయోజనం లేకుండా పోయింది . అవునన్నా , కాదన్నా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల పై  నంద్యాల ఫలితాల  ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఇది టీడీపీ కి ప్లస్ పాయింట్ .  అయితే స్థానిక సంస్థల ఎన్నికలో స్థానిక అంశాలకే ప్రాధాన్యత ఉంటందని , కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటం ,వారు టీడీపీపై అసంతృప్తి గా ఉన్నారని అది తమకు కలిసొచ్చే అంశమని వైకాపా భావిస్తుంది . 

      48 డివిజన్లకు సంబంధించిన ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి.   చివరి రెండురోజులు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు రోడ్‌షోలతో హోరెత్తించారు. తెలుగుదేశం పార్టీ  తరుపున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శని,ఆదివారాలు ప్రచారం నిర్వహించారు. విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం చివరి రోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. మత్స్యకారులు అధికంగా ఉండే ప్రాంతాలపై ఆయన దృష్టిసారించారు.తన ప్రచారంలో భాగంగా ప్రభుత్వ హామీల అమలపై ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు చివరి రోజు ప్రచారం చేశారు. కాలనీల్లో బలమైన నేతలను, కాలనీ సంఘాలను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు ప్రయత్నించాయి. 

    గత 2014 ఎన్నికల సమయంలో కోర్టు ఉత్తర్వుల మేరకు  ముందుగా జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపును  సార్వ త్రిక ఎన్నికల అనంతరమే కొనసాగించిన విషయం గుర్తు చేసుకో వచ్చు . కోస మెరుపు ఏమిటంటే టీడీపీ ,వైకాపా రొండు పార్టీలు  నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని భావించటంతో  ఈ విషయం పై దృష్టి  సారించి నట్లు  లేదు ప్రస్తుతం ఒక్క టీడీపీ కే అనుకూలం గా మారాయి  నంద్యాల విజయాన్ని  టీడీపీ నేత‌లు ప్ర‌చారంలో అస్త్రంగా ఉప‌యోగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: టీడీపీకి నంద్యాల విజయమే కాకినాడ ఎన్నిక ప్ర‌చార అస్త్రం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top