Translate

  • Latest News

    28, ఆగస్టు 2017, సోమవారం

    ఎలా ఓడాం. వైకాపా లో అంతర్మధనం ... ముందే ఫలితాలను అంచనా వేసిన భిన్నస్వరం... 2019 ఎన్నికల్లో టీడీపీది ఇదే వ్యూహం



    ఎలా ఓడాం. వైకాపా లో  అంతర్మధనం
     ముందే ఫలితాలను అంచనా వేసిన  భిన్నస్వరం 
    2019 ఎన్నికల్లో టీడీపీది ఇదే వ్యూహం

    నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు సర్వేల రిపోర్టులు, వివిధ పార్టీల నాయకుల అంచనాలకు విభిన్నంగా వెల్లడయ్యాయి. భారీ మోజార్టీతోనే టీడీపీ గెలిస్తే జరుగనున్న పరిణామాలపై భిన్నస్వరం ముందుగానే అంచానా వేసింది. ఇదే అంశాన్ని ఎన్నికల ఫలితాలకు ముందురోజు ఈ వెబ్ సైట్ ద్వారా.

     నంద్యాల ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే తిరిగేలేదు.ఒంటరిపోరుతో భవిష్యత్తులో మారనున్న రాజకీయాలు . అంటూ కథనాన్ని వెలువరించాం.

     . ఈ ఎన్నికలకు టీడీపీకి ప్రతిష్టాత్మకమైనవి. మూడున్నర సంవత్సరాల టీడీపీ పాలనకు ఇవే రిఫరెండం. ప్రజాపయోగ కార్యక్రమాలు చేపట్టామని చెప్పిన అధికార టీడీపీకి ప్రజాతీర్చు. అయితే తక్కువ మోజార్టీ వస్తే చెప్పకోవటానికి ఏమి మిగలదు. ఎన్ని వ్యూహాలు రచించినా, వైకాపా అధినేత జగన్ రోజుల పాటు ప్రజల్లో తిరిగినా ప్రజావ్యతిరేకతను తమకు అనుగుణంగా మార్చుకోలేకపోయారన్నది విస్పష్టం. మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులపై చేసిన వ్యాఖ్యలు. కాపు సామాజిక వర్గం నుంచి వెల్లడౌవుతున్న వ్యతిరేకత,టీడీపీ బీజేపీ దోస్తి ముస్లింలను దూరం చేయలేకపోయాయి. దళితులు, ముస్లింలు, కాపు సామాజిక వర్గాన్ని ఓట్ల రూపంలో మలుచుకొనే వ్యూహం వైకాపాలో కరువైంది. అధినేత జగన్ నంద్యాలలో ఇంటింటి కి తిరిగి చేసిన ప్రచారం కూడా ఓటర్లను ఆకట్టలేకపోయింది. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా టీడీపీకే ప్లస్ పాయింట్గా మారాయి. సరైనా వ్యూహరచన లేకపోవటం వల్లే వైకాపా ఈ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైందని విశ్లేషకుల వాదన. దీంతో పాటు మితిమీరిన ఆత్మవిశ్వాసం వైకాపా విజయానికి గండి కొట్టిందని తెలుస్తోంది. ఇకనైనా సరైన వ్యూహరచన , కిందిస్థాయి క్యాడర్ను సైతం భాగస్వాముల్ని చేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు సాగుతారని అభిమానులు అశిస్తున్నారు. 2019 టీడీపీది ఇదే అస్త్రం విజయమే అంతిమ లక్ష్యంగా వ్యూహరచన చేసి పనిచేసిన టీడీపీకి ఈ విజయం క్యాడర్లో నూతన ఉత్సహం నింపింది. ఒకవైపు మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలపకపోయినా, బీజేపీ మద్దతు తెలిపినా ప్రచారంలో పాల్గొనపోయినా టీడీపీ చేసిన ఒంటరి పోరు లభించింది. ఇది ఒక రకంగా టీడీపీలో మనో స్థిర్యాన్ని నింపిందనే చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించే విషయంలో వారు చెప్పినట్లు కాకుండా టీడీపీ చెప్పినట్లే నడుచుకొనే పరిస్థితి రావచ్చు. ఈ ఎన్నికల్లో డబ్బు అధికారాన్ని టీడీపీ విస్తృత స్థాయిలో వినియోగించిందన్న అభియోగాలు ఉన్నాయి. ఈ ఎన్నికల ద్వారా అధికార టీడీపీ ప్రజా సంక్షేమ పథకాలు, ఇతర అంశాలను పునఃసమీక్షించుకుంటే రానున్న ఎన్నికల్లో సైతం ఇదే తరహ విజయలు సాధించటం అసాధ్యమేమి కాదు.

                                                                                                                      శ్రీహర్ష


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఎలా ఓడాం. వైకాపా లో అంతర్మధనం ... ముందే ఫలితాలను అంచనా వేసిన భిన్నస్వరం... 2019 ఎన్నికల్లో టీడీపీది ఇదే వ్యూహం Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top