Translate

  • Latest News

    28, ఆగస్టు 2017, సోమవారం

    నంద్యాలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మ్యాజిక్ పనిచేయలేదా ...?


    నంద్యాలో ఎన్నికల  వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మ్యాజిక్ పనిచేయలేదా ...?


    ప్రకటించిన నంద్యాల ఉప  ఎన్నికల్లో వైకాపా, టీడీపీ జోరుకు చతికిల పడింది . ఎన్నికల  వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మ్యాజిక్ పనిచేయలేదు. అయన వైకాపా తరుపున భాద్యతలు చేపట్టిన అనంతం జరిగిన తొలి ఎన్నిక ఇదే కావటం విశేషం . గతంలోను  లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయానికి, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ గెలవడానికి కారణమైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మ్యాజిక్ ఉత్తరప్రదేశ్‌లో పనిచేయలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో  జతకట్టినా కాంగ్రెస్ చతికిలపడింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కిశోర్‌పైనా విమర్శలు వచ్చాయి అప్పట్లో . ఎన్నికల ఫలితాల తర్వాత కిశోర్ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు. ఏకంగా లక్నోలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దే ఈ పోస్టర్ దర్శనిమచ్చింది. అంతేగాక ఆయన ఆచూకీ చెప్పిన వారికి 5 లక్షల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లే గెలిచింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కాంగ్రెస్ ఇంత దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి. యూఫీ ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. పార్టీని ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. కిశోర్‌పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాజేష్ సింగ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. కాగా కిశోర్‌పై చేసిన విమర్శలను ఆయన సమర్థించుకున్నారు. తాము పార్టీ కోసం రక్తం ధారపోస్తే, కిశోర్ తమపై స్వారీ చేశారని, ఎన్నికల్లో తమ అభిప్రాయాలను పూర్తిగా విస్మరించారని, ఓటమికి ఆయనే కారణమని నిందించారు.  ఏదేమైనా నరేంద్ర మోదీ, నితీష్ కుమార్‌లను విజయపంథాన నడిపించిన కిశోర్.. నంద్యాల ఉప ఎన్నికల్లో  ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారు. ఈ విషయం పై వైకాపా శ్రోణులో అంతర్మధనం మెదలయింది 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నంద్యాలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మ్యాజిక్ పనిచేయలేదా ...? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top