Translate

  • Latest News

    28, ఆగస్టు 2017, సోమవారం

    నంద్యాల ఉప ఎన్నికల్లో ఉద్యోగులు ఓటు ఎందుకు వినియోగించుకోలేదు.. ? అసలేం . జరిగింది. ?


    నంద్యాల ఉప ఎన్నికల్లో  ఉద్యోగులు ఓటు ఎందుకు వినియోగించుకోలేదు.. ?
    అసలేం . జరిగింది. ?

    నంద్యాల ఉప ఎన్నికల్లో అనూహ్యస్థాయిలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కొని  సరికొత్త రికారు సృష్టించారు , పోస్టల్ ఓట్లు ఉద్యోగులు వినియోగించుకోకపోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోమవారం నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియలో ఈ అంశంపై బయట పడింది. మొత్తం 250 ఓట్లు ఉంటే ఇందులో 211 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోలేదు. వారు పార్టీకి ఓటు వేయలేదు. ఓట్లు వేసిన 39 పోస్టల్ ఓట్లు కూడా చెల్లలేదు. ఈ పరిణామం ఒకింత కలవరానికి గురి చేసే అంశమే. ఓటు వేయాలని,ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలను  చైతనం చేసే అధికారులు ఓటింగ్కు దూరంగా ఉండటం గమనించదగ్గ అంశం. ఇందుకు ఏ అంశాలు దోహదపడ్డాయి.కొన్ని ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లే నిర్ణయాత్మకంగా వ్యవహరించిన సందర్భాలు కూడా గతంలో ఉన్నా విషయాన్ని విస్మరించలేము. వారు ఎందుకు ఓటు హక్కు వినియోగించులేదన్న విషయాలు పలు సందేహాలకు సైతం కారణమౌతున్నాయి. అక్కడ పోటీ చేసిన పార్టీల పట్ల అయిష్టత ప్రకటించారా..? లేదా ఎవరైనా ఒత్తడి చేయటం వలన మూకమ్మడిగా ఎన్నికలను బహిష్కరించారా, ఓట్ల వేసే స్వేచ్చ లేకుండా పోయిందా. ఇతర వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉన్నాయా. అన్నది తేలాల్సి ఉంది.ఈ విషయంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇందుకు గల కారణాలను విశ్లేషించి తప్పలు సరిచేసుకోవాల్సి ఉంది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నంద్యాల ఉప ఎన్నికల్లో ఉద్యోగులు ఓటు ఎందుకు వినియోగించుకోలేదు.. ? అసలేం . జరిగింది. ? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top