Translate

  • Latest News

    27, ఆగస్టు 2017, ఆదివారం

    జ్వరాల సీజన్


    జ్వరాల  సీజన్ 
    ఎడతెరిపి లేని వర్షాలతో ఎక్కడ చూసినా చిత్తడి, బురద నీళ్లు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు. వీటన్నిటితో తెగ చిరాకేస్తోంది కదూ! కానీ ఈ వాతావరణాన్ని ఇష్టపడే జీవులున్నాయి. ఇవి వర్షాకాలంలో విపరీతంగా విజృంభించేసి మొండి జ్వరాలతో ఒంటిని, ఇంటినీ హూనం చేసేస్తాయి.వాతావరణంలో విస్తరించి ఉండే బ్యాక్టీరియా, వైర్‌సలే! ఇవి ఈగలు, దోమలు, సూక్ష్మక్రిముల ద్వారా మన శరీరంలోకి చేరుకుని జ్వరాలను కలిగిస్తాయి. చల్లని వాతావరణం, అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం, నీరు కారణంగా జ్వరాలు వ్యాపిస్తాయి. అయితే ఎక్కువ శాతం జ్వరాలు దోమల నుంచే సంక్రమిస్తాయి. దోమల్లో రకాలను బట్టి జ్వరాల్లోనూ తేడాలుంటాయి.వర్షాకాలంలో జ్వరం సాధారణం అనుకుంటాం. కానీ ఆ జ్వరాలకు కారకాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి చేతికందిన జ్వరం మాత్ర వేసుకుని ఊరుకోకుండా వైద్యుల్ని కలిసి, పరీక్షలు చేయించుకుని, జ్వరానికి కారణమైన ఇన్‌ఫెక్షన్‌ గురించి తెలుసుకోవాలి. జ్వరం కనిపించగానే వైద్యుల్ని కలవగలిగితే వ్యాధిని సకాలంలో గుర్తించే వీలుంటుంది.
    వర్షాకాలం జ్వరాలకు ప్రధాన కారణం...అపరిశుభ్రత, నిల్వ నీరు, దోమలు, ఈగలు, పెంపుడు జంతువులు, పురుగులే! కాబట్టి ఇవి దరిచేరకుండా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటి నివాసానికి వీలులేని వాతావరణాన్ని కల్పించాలి.ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.టైర్లు, కొబ్బరి చిప్పలు, తొట్లు...ఇలా వాన నీరు నిల్వ ఉండే వస్తువులను పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి.ఆహారం తినేముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
    ఆహార పదార్థాల మీద మూతలు ఉంచాలి.నీళ్లు కాచి, వడపోసి తాగాలి.పెంపుడు జంతువులు ఉండే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి.దోమలు కుట్టకుండా శరీరం మొత్తాన్నీ కప్పే దుస్తులు ధరించాలి.దోమ తెరలు వాడాలి. మస్క్యుటో రిపెల్లెంట్స్‌ వాడాలి.
      
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జ్వరాల సీజన్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top