Translate

  • Latest News

    25, ఆగస్టు 2017, శుక్రవారం

    దేవదాసు కథనే మరోసారి ఈ జనరేషన్ కు తగ్గట్టు

    అర్జున్ రెడ్డి' మూవీ రివ్యూ
    దేవదాసు కథనే మరోసారి ఈ జనరేషన్ కు తగ్గట్టు



    అర్జున్ రెడ్డి(విజయ్ దేవరకొండ)మంగళూరు మెడికల్ కాలేజీ లో మెడిసిన్ చేస్తుంటాడు. స్వతహాగా కోపిష్టి అయిన అర్జున్ ది చాలా దూకుడు మనస్తత్వం.నోటికి ఎంతోస్తే అంతా అనేయటం అతని నైజం. ప్రీతీ(శాలిని పాండే)ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతుంది. మొదటి చూపులోనే తనను ప్రేమించిన అర్జున్ చివరికి ప్రీతీని తన ప్రేమలో పడేలా చేసుకుని అన్నిరకాలుగా దగ్గర అవుతాడు. కాని ఈ పెళ్లి ఇష్టం లేని ప్రీతీ తండ్రి ప్రవర్తన వల్ల ఇద్దరు దూరం అవ్వడమే కాక ప్రీతీకి వేరే అబ్బాయితో పెళ్లి కూడా అయిపోతుంది. ఇది తెలిసిన అర్జున్ తట్టుకోలేక ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోయి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో ఉద్యోగం చేసుకుంటూ అన్ని రకాల వ్యసనాలకు బానిసగా మారతాడు. ఇంతలో అనుకోకుండా హాస్పిటల్ లో చేసిన సర్జరి ఒకటి ఫెయిల్ కావడంతో కేసులో ఇరుక్కుంటాడు. మరి అర్జున్ రెడ్డి అందులో నుంచి ఎలా బయటికి వచ్చాడు, చివరికి ప్రీతిని కలుసుకున్నాడా లేక మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అనేది అసలు కథ 
    దేవదాసు కథనే మరోసారి ఈ జనరేషన్ కు తగ్గట్టుగా మలిచిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మంచి విజయం సాధించాడు. సినిమాను ఎంతో రియలిస్టిక్ గా తెరకెక్కించిన దర్శకుడు.. తన అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడు. కేవలం యూత్ ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించిన అర్జున్ రెడ్డి.. ఆ వర్గాన్ని బాగానే మెప్పిస్తుంది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటుడికి అర్జున్ రెడ్డి లాంటి పాత్ర ఓ ఛాలెంజ్ లాంటిదే. అలాంటి టిపికల్ క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడనే చెప్పాలి. పట్టలేని కోపం, ప్రేమ ఉన్న వ్యక్తిగా.. వ్యసనాలకు బానిసనై భగ్న ప్రేమికుడిగా విజయ్ మంచి వేరియేషన్స్ చూపించాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ విజయ్ ని వరించటం అదృష్టమనే చెప్పాలి. హీరోయిన్ గా ప్రీతి ఆకట్టుకుంది

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: దేవదాసు కథనే మరోసారి ఈ జనరేషన్ కు తగ్గట్టు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top