Translate

  • Latest News

    25, ఆగస్టు 2017, శుక్రవారం

    ఎవరీ ... బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌


     ఎవరీ ... బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ 


    భారత్ లో బాబాలకు కొదవ లేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తి వెనక లక్షలాది మంది ప్రాణాలు ఇవ్వటానికి సైతం నిలవటం విశేషం ఆయనే బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ . డేరా సచ్చా సౌదా అనే సిక్కు మత సంస్ధ చీఫ్‌. దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో లక్షలాది మంది నిమ్నజాతీయులు ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తారు. నడిచే దేవుడిగా భావిస్తారు. 2002లో ఆయనపై హత్య, అత్యాచార కేసు నమోదైంది. అయినా, బాబాను పూజించే వారి సంఖ్య తగ్గలేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.
    సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు గుర్మీత్‌ ప్రారంభించిన డేరా సచ్చా సౌధాలో చేరారు. ఈ గ్రూపులో చేరిన వారందరినీ డేరాలు అంటారు. ఈ గ్రూపులో చేరిన అత్యధికులు పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే. సమాజం తమపై చూపుతున్న వివక్షను భరించలేక డేరాల్లో చేరుతుంటారు. డేరాల సంస్కృతి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. మధ్యయుగ కాలం నుంచి ఉత్తర భారతదేశంలో డేరాలు ఉన్నాయి.

    డేరా సచ్చాసౌధాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు నెలకొల్పాడు. ఆయన బోధనలకు లక్షలాది మంది ఆకర్షితులయ్యారు. ఈ సంప్రదాయంలో కులాల వంటి అడ్డుగోడలుండవు. దీంతో ఎంతో మంది నిమ్నజాతీయులు డేరా సచ్చాసౌధా చేరడానికి ఆసక్తిని కనబరుస్తారు. ప్రార్థనల కోసం నామ్‌ చర్చాఘర్‌లను నిర్మించుకున్నారు. డేరాల్లో శ్రీమంతుడినైనా, బీదవాడినైనా ఒకే రకంగా పరిగణిస్తారు. పంజాబ్‌, హర్యానాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది దళితులు గుర్మీత్‌ బోధనల పట్ల ఆకర్షితులై అందులో చేరారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఎవరీ ... బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top