Translate

  • Latest News

    25, ఆగస్టు 2017, శుక్రవారం

    మధుమేహ వ్యాధిగ్రస్తులు- ఆల్కహాల్‌ విషయంలో జాగ్రత్తలు

    మధుమేహ వ్యాధిగ్రస్తులు- ఆల్కహాల్‌ విషయంలో   జాగ్రత్తలు

    .  
    షుగర్ వ్యాధి గ్రస్తులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో చాలామందికి తెలుసు. కానీ ఆల్కహాల్‌ విషయంలో  ఎలాంటి జాగ్రత్తలు అనుసరించాలో మటుకు చాలామందికి తెలియదు.   వీళ్లు  అతిగా ఆల్కహాల్‌ తాగితే తలెత్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే  అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ చెప్పిన ప్రకారం ఆల్కహాల్‌ తీసుకోవాలనుకునే మధుమేహవ్యాధిగ్రస్తులు ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వారి షుగర్‌ నియంత్రణలోనే ఉందా లేదా  గమనించుకోవాలి.  రెండవది డయాబెటిక్‌ నరాల జబ్బు ,అధిక రక్తపోటులాంటి  అనారోగ్య సమస్యలు వారికున్నాయా అన్నది  తేల్చుకోవాలి. మూడవది ఆల్కహాల్‌ తీసుకోవడంవల్ల కలిగే హాని, దుష్ప్రభావాల గురించిన అవగాహన ఉండాలి. ఇవి తెలిస్తే ఆల్కహాల్‌ వినియోగంలో ఆచితూచి ప్రవర్తిస్తారు. అనారోగ్యంపాలు కారు. ఆల్కహాలు తాగడం వల్ల ఉండే ముఖ్యమైన సమస్య ఏమిటంటే   సల్ఫోనిలురియా, మెగ్లిటినైడ్‌ లాంటి డయాబెటిస్‌ మందులు పాంక్రియా్‌సపై తీవ్ర ప్రభావం చూపి ఎక్కువ ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు లోబ్లడ్‌షుగర్‌  తలెత్తే అవకాశం ఉంది. 
    ఎందుకంటే కాలేయం బ్లడ్‌షుగర్‌ని క్రమబద్ధీకరించడానికి బదులు రక్తంలోంచి ఆల్కహాల్‌ను తొలగించే పనిలో ఉంటుంది.   శరీరంలో షుగర్‌ ప్రమాణాలను జాగ్రత్తగా గమనించుకుంటుండాలి. అంతేకాదు  ఖాళీ కడుపుతో ఆల్కహాల్‌ తాగడం, రకరకాల డ్రింకులు కలుపుకుని తాగడం, వ్యాయామాలు చేయడం వల్ల కూడా శరీరంలో షుగర్‌ ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువ ఆల్కహాల్‌ తీసుకున్నా, తక్కువ బ్లడ్‌ షుగర్‌ ఉన్నా ఒకే రకమైన లక్షణాలు కనపడతాయి. నిద్ర నిద్రగా అనిపిస్తుంది. తలతిరుగుతున్నట్టు, అన్‌రె్‌్‌స్టగా ఉంటుంది. అంతేకాదు ఎక్కువ ఆల్కహాల్‌ తీసుకుంటే ఇన్సులిన్‌ ఎఫెక్ట్‌ తగ్గిపోయే ప్రమాదం ఉంది.  దాంతో బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలు పెరిగిపోతాయి. ఇది చాలా ప్రమాదకరం.  ఖాళీ కడుపుతో ఆల్కహాల్‌ తీసుకోకూడదు.  ఆల్కహాల్‌ తీసుకునేముందు, తీసుకునేటప్పుడు ఏదైనా ఆరోగ్యకరమైన స్నాక్‌ను తప్పనిసరిగా తినాలి. వెజిటబుల్‌ సలాడ్‌తోపాటు నట్స్‌ తింటే మంచిది. లేదా ఆల్కహాల్‌ తీసుకునేటప్పుడు ఎగ్‌వైట్స్‌ తీసుకున్నా మంచిది. ఇవి కాకుండా రోస్ట్‌  లేదా గ్రిల్డ్‌ ఫిష్‌,ఇతర నాన్‌వెజ్‌ ఐటమ్‌  తినొచ్చు.  అయితే వీటితో పాటు వెజిటబుల్‌ సలాడ్‌  తీసుకుంటే మంచిది.  ఆల్కహాల్‌ తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్‌ ఉండేలా జాగ్రత్తపడాలి.
    - నాన్‌ఆల్కహాలిక్‌ డ్రింకులు ముందర తాగి ఆ తర్వాత ఆల్కహాల్‌ తీసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల ఆల్కహాల్‌ ఎక్కువ కాకుండా మితంగా తీసుకుంటారు.    సోడా లేదా నీళ్లను కలుపుకుని తాగితే మంచిది. సాఫ్ట్‌ డ్రింకులు , ప్రొ-డైట్‌ ప్రాడక్టులను ఆల్కహాల్‌లో కలుపుకుని తాగొద్దు.
    - ఆల్కహాల్‌ తాగేటప్పుడు వేగంగా కాకుండా మెల్లమెల్లగా సిప్‌ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్‌ షుగర్‌ మీద ఎక్కువ ప్రభావం పడదు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మధుమేహ వ్యాధిగ్రస్తులు- ఆల్కహాల్‌ విషయంలో జాగ్రత్తలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top