Translate

  • Latest News

    23, ఆగస్టు 2017, బుధవారం

    టాక్ ఇండియా పేరిట చైనా భారత్ పై జాతివివక్ష వ్యాఖ్యలు

    టాక్ ఇండియా  పేరిట  చైనా  భారత్ పై   జాతివివక్ష వ్యాఖ్యలు

    వ్యంగ్యం పేరిట ఇప్పటికే భారత్ పై    పూరితమైన వీడియోను ప్రసారం చేసిన చైనా అధికారిక మీడియా జిన్హుహా. తాజాగా మరో  వీడియోను ప్రసారం చేసింది.  .

    7 సిన్స్ఆఫ్ ఇండియా' (భారత్ ఏడు పాపాలు) పేరిట గతవారం ప్రసారం చేసిన వీడియోలో జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు, వ్యంగ్యం జిన్హుహా అభాసుపాలైంది. ఆ వీడియోలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. చైనా యాంకర్ సిక్కు మతస్తుడి మాదిరిగా గడ్డం అంటించుకొని భారతీయులను అనుకరించే ప్రయత్నం చేయడం నవ్వుతెప్పించడానికి బదులు వికారం, రోత తెప్పించింది. అంతేకాకుండా భారతే దురాక్రమణ పూరితంగా చైనా భూభాగంలోకి ప్రవేశించిందన్న ఆ దేశ కమ్యూనిస్టు సర్కారు వైఖరిని ఈ వీడియోలోని యాంకర్లు వల్లేవేశారు. టాక్ ఇండియా' పేరిట జిన్హుహా వార్తాసంస్థ ఓ సిరీస్ ను  ప్రసారం చేస్తున్నట్టు ఈ వరుస వీడియోలను బట్టి అర్థమవుతోంది. తాజా వీడియోలోనూ అవే వ్యాఖ్యలు, వైఖరి ప్రస్ఫుటం కావడం గమనార్హం. డోక్లాం చైనా భూభాగమని, భారతే తమ భూభాగంలోకి చొరబడిందని చెప్పుకొచ్చింది. చైనాకు చెందిన పీపుల్స్  లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఏమాత్రం సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడలేదని నొక్కి చెప్పుకొంది. అయితే, ఈ వీడియోలో భూటాన్  ప్రస్తావన లేకపోవడం గమనార్హం. భారత్-భూటాన్-చైనా ట్రైజంక్షన్లో ని డోక్లాం ప్రాంతం భూటాన్ ది అని, అక్కడ చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టడం సరికాదని భారత్, భూటాన్  పేర్కొంటున్న సంగతి తెలిసిందే. అయినా, చైనా మొండిగా తన దురాక్రమణ ధోరణితో డోక్లాం తనదేనని వాదిస్తున్న సంగతి తెలిసిందే.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: టాక్ ఇండియా పేరిట చైనా భారత్ పై జాతివివక్ష వ్యాఖ్యలు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top