Translate

  • Latest News

    23, ఆగస్టు 2017, బుధవారం

    ట్రిపుల్ తలాక్ చెల్లదు.

    ట్రిపుల్ తలాక్ చెల్లదు.

    ఇస్లాం మతంలో కోన సాగుతున్నట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు చెప్పింది  ఈ అంశం పై   చట్టం తీసుకురావాలని  కేంద్రాన్ని ఆదేశించి ,చట్టం  తీసుకువచ్చే వరకూ ఎలాంటి పిటిషన్ల  తీసుకునేది లేదని స్పష్టం చేసింది . చట్టం చేసిన  తర్వాతే దానికి లోబడి కేసులను విచారణను న్యాయస్థానం విచారిస్తామని పేర్కొంది   . చట్టం చేయటానికి  సుప్రీంకోర్టు కేంద్రానికి ఆరు నెలల గడువిచ్చింది. ఆరు నెలల పాటు ట్రిపుల్ తలాక్ అమలులో ఉండదని ఈ తీర్పును వెల్లడించింది.   ఆ పద్ధతి అక్రమ మని తేల్చేసింది.  ఇప్పటివరకూ చేపట్టిన విచారణ ను    రిజర్వ్లో పెట్టింది. పేర్కొంది.  ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం'  సంచలన తీర్పు  వెలవ రించింది షరియా చట్టాలను పరిగణనలోకి తీసుకొని చట్టం తీసుకురావాలని కేంద్ర చెప్పింది.
    చట్టం  చేసే సమయంలో ముస్లిం సంఘాల అభిప్రాయా లను కూడా తీసుకోవాలని సూచించింది. దీనిపై రాజకీయ పక్షాలన్నీ కేంద్రానికి సహకరించాలని తెలిపింది. ట్రిపుల్ తలాక్ పై ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. జస్టిన్  రోహింటల్ ఫాలి నారిమన్  జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ట్రిపుల్ తలాక్ పద్ధతిని రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. చీఫ్ జస్టిస్ జెహర్ . జస్టిన్ నాజిర్ మాత్రం ట్రిపల్ తలాక్ రాజ్యాంగబద్ధమన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్థికల్ 14, 15, 21, 25లను తలాక్-ఇ-బిద్దత్ ఉల్లంఘించినట్లు లేదని భేహర్ తెలిపారు. వ్యక్తిగత చట్టం ద్వారా ఆ పద్ధతి అమలులో ఉందన్నారు. వెయ్యేళ్లకు పైగా అమలు జరుగుతున్న ఆచారమని చెప్పారు. ఈ స్థితిలో తలాక్ అంశాన్ని పార్లమెంట్ కే  వదిలి  వేయాలని చీఫ్ జస్టిన్ ఖేహర్ అభిప్రాయపడ్డారు. అది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనంలో మెజార్టీ సభ్యులు వాదించారు. ఈ తలాక్ రాజ్యంగబద్ధం కాదని ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిన్ కురియన్, జస్టిస్ లలిత్, జస్టిస్ నారిమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇస్లాం దేశాల్లోనే ఈ ఆచారం లేనప్పుడూ భారత్ లో  ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. ముమ్మారు తలాక్ సమానత్వ హక్కును అతిక్రమిస్తోందన్నారు. 3-2 తేడాతో ధర్మాసనం ట్రిపుల్ తలాక్ పిటీషన్ను కొట్టివేసింది. 1400 ఏళ్ల మతాచారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ట్రిపుల్ తలాక్ మహిళల ప్రాథమిక హక్కులను కాలరాచేలా ఉందని. ఈ విధానాన్ని తొలగించేలా చట్టం తీసుకురావాలని పిటిషన్ దారులు  కోరారు. పిటిషన్లపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మత సంబంధమైన వ్యవహారాలపై కోర్టు జోక్యం సరికాదని చెప్పింది. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం.  తీర్పు వెల్లడించింది.
                       

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ట్రిపుల్ తలాక్ చెల్లదు. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top