Translate

  • Latest News

    23, ఆగస్టు 2017, బుధవారం

    ముస్లిం దేశాల్లో ట్రిపుల్‌ తలాక్

    ముస్లిం దేశాల్లో ట్రిపుల్‌ తలాక్

    అత్యధిక ముస్లిం దేశాల్లో ట్రిపుల్‌ తలాక్‌ ఆచారాన్ని పాటించడం లేదు. చాలా దేశాలు రద్దు కూడా చేశాయి. వ్యక్తిగతంగా భార్యకు భర్త అప్పటికప్పుడు హడావుడిగా మూడుసార్లు తలాక్‌ చెప్పి వదిలేసేందుకు వీల్లేదు. సివిల్‌ కోర్టుల్లో మాత్రమే విడాకులు తీసుకోవలసి ఉంటుంది. ఈజిప్టు, పాకిస్థాన్‌లలో వెంటవెంటనే ముమ్మారు తలాక్‌ చెబితే దానిని ఒక్కసారి చెప్పినట్లుగానే భావిస్తారు. భారతదేశంలో 17.2 కోట్ల మంది ముస్లింలు ఉంటే వారిలో అత్యధికులు సున్నీలు.వారే ట్రిపుల్‌ తలాక్‌ ఆచారాన్ని పాటిస్తున్నారు. అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ఈ విధానాన్ని ఇతర ముస్లిం దేశాల్లో మాదిరిగా సంస్కరించి ప్రజాస్వామ్యబద్ధంగా మహిళలకు హక్కులు కల్పించాలని పలు సందర్భాల్లో న్యాయస్థానాలు వ్యాఖ్యానించాయి. అలా జరక్కపోవడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ట్రిపుల్‌ తలాక్‌ చట్ట రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్ని ముస్లిం దేశాల్లో ఈ ఆచారం ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం.

    టర్కీ, సైప్రస్‌: తలాక్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మొదట ఆ వివాహాన్ని గణాంకాల విభాగంలో నమోదు చేసుకుని ఉండాలి. అప్పుడే సివిల్‌ కోర్టులో విడాకుల ప్రక్రియ మొదలు పెట్టొచ్చు.


    ఇండోనేసియా: కోర్టులో మాత్రమే విడాకులు పొందాలి. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో తలాక్‌ తీసుకోవడం కుదరదు.
    మలేసియా: న్యాయస్థానాలే నిర్ణయించాలి.
    ఇరాన్‌: విడాకుల కోసం ప్రత్యేక సివిల్‌ కోర్టులు ఏర్పాటుచేశారు. పరస్పరం అంగీకారానికి వస్తే రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు వెళ్లి విడాకులు తీసుకోవచ్చు. - సెంట్రల్‌ డెస్క్
    ఇరాక్‌ : షరియా కోర్టులను రద్దు చేసిన తొలి అరబ్‌ దేశం. 1959లో కోర్టుల ద్వారా మాత్రమే విడాకులు పొందాలని చట్టం తెచ్చింది. అందరికీ ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదు. భార్యాభర్తల్లో ఎవరైనా విడాకులు కోరుకోవచ్చు.

    బంగ్లాదేశ్‌: ట్రిపుల్‌ తలాక్‌ కోర్టుల్లో చెల్లదు. భార్య గానీ, భర్త గానీ విడాకులు ఇవ్వదలిస్తే ముందుగా లిఖితపూర్వకంగా నోటీసివ్వాలి.
     
    పాకిస్థాన్‌: కోర్టులో మాత్రమే విడాకులు తీసుకోవాలి. భార్యకు విడాకులు ఇవ్వదలచిన భర్త ముందుగా స్థానిక కౌన్సిల్‌ చైర్మన్‌కు నోటీసు ఇవ్వాలి. దానిని భార్యకు కూడా పంపాలి. ఇన్‌స్టంట్‌ తలాక్‌ లేదు.

    శ్రీలంక : శ్రీలంక చట్టం ఆదర్శప్రాయమైనదని ఇస్లామిక్‌ మేధావులు చెబుతారు. తొలుత ఖాజీకి నోటీసులివ్వాలి. ఇరువైపులా బంధువులకు, పెద్దలకు, ఆ ప్రాంతంలోని ముస్లిం ప్రముఖులకు కూడా పంపాలి. అందరూ కలిసి రాజీ ప్రయత్నం చేస్తారు. నోటీసులిచ్చిన 90 రోజుల తర్వాత సాక్షుల సమక్షంలో తలాక్‌ చెప్పవచ్చు.

    ఈజిప్టు : ఒకే దఫా మూడుసార్లు తలాక్‌ చెబితే దానిని ఒకసారి చెప్పినట్లుగానే పరిగణించాలని 1929లో అంగీకరించారు. ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేయవచ్చని కూడా తీర్మానించారు.

    సౌదీ అరేబియా: విడాకులు అరుదు. భర్త తన మనసులో అనుకుంటే చాలు.. భార్యకు తలాక్‌ చెప్పవచ్చు. సిరియా, జోర్డాన్‌, బ్రూనే, సూడాన్‌ దేశాల్లో కూడా ట్రిపుల్‌ తలాక్‌ ఆచారం లేదు. 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ముస్లిం దేశాల్లో ట్రిపుల్‌ తలాక్ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top