కమ్యునిజం రూపుమాసిపోయిందని, కమ్యునిస్తు దేశాల్లో సైతం పెట్టుబడి దారి తరహ పాలన మొదలైందని కొంతమంది ప్రచారం చేస్తుంటారు. కమ్యునిజాన్ని అన్వయించే క్రమంలో జరిగిన పొరపాట్లకు ఒక సిద్దాంతాన్ని తప్ప పట్టడం సరికాదు. సమాజంలో వ్యాత్యాసాలు ఉన్నంతవరకు, పేద పెద్ద తేడా కొనసాగుతున్నంత కాలం కమ్యునిజం అజరామరమే. ఈ మాట అంటే కొంతమంది తప్ప పట్టవచ్చుమే కాని దేశంలో నిజమైన కమ్యునిస్తులు ఒక్క 20శాతం ఎక్కువ మంది ఉండకపోవచ్చు. కారల్ మార్క్స్ స్థానిన్,లెనిన్, మావో పేర్లు ఉటంకిస్తూ కమ్యునిస్తులని చెప్పకొనే వారు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఆచరణనే గీటురాయి అంటూ మావో చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఉటంకించవచ్చు. ఇదంతా ఎందుకు గాని నేరుగా విషయంలోకి వద్దాం.
తమిళనాట సినీ హీరో కమలహాసన్ పార్టీ పెట్టబోతున్నాడు. మంచిదే ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు. కాని కమల్ నోట కమ్యునిస్తు సిద్దాంతం రావటం, నేరుగా కమ్యునిస్తు నేతలతో సంప్రదింపులు జరపటం విశేషం. కమల్ గాని మరోవరు పార్టీ పెట్టినా కమ్యునిజం వల్లెవేయటం అనవాయితీగా వస్తున్నదే. గతంలో ఆంధ్రరాష్ట్రంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసే క్రమంలో నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అంటూ కమ్యునిస్తు నాయకుల త్యాగాలను కీర్తించారు. అనంతరం ఎన్కౌంటర్ల పేరుతో ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారని పౌరహక్కుల సంఘాల నేతలు గగోలు పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం కమ్యునిస్తుల ప్రేమ ఉన్నట్లు నటించారు. చర్చల పేరుతో అడవుల్లో ఉన్న నక్సలైట్లను బయటకు తెప్పించి అనంతరం పలువురు సీనియర్ నక్సలైట్ల మరణానికి కారణమయ్యారు. అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు కూడా ఆయన కమ్యూనిస్ట్ సిద్దాంతం గురించి పలు సందర్భాలు ప్రస్తావించారు. కమ్యునిస్ట్ యో ధుడు పుచ్చలపల్లిసుందరయ్య బంధువు డాక్టర్ మిత్రను పక్కన కూర్చొపెట్టుకొని తాను నిజమైన కమ్యూనిస్ట్ ల అంటూ ప్రచారం సాగించారు. మాజీ నక్సలైట్ల సేవలను పార్టీలో వినియోగించుకుంటామని వందలాదిమందిని పార్టీలో చేర్చుకున్నారు. ఆ పార్టీ తీరుతెన్నులు, కమ్యునిజం పేరుతో అనుసరించిన విధానం అందరికి తెలిసిందే. ఇక ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో పార్టీ పెట్టాడు. ఇతను కమ్యునిజంమీద ప్రేమ ఉన్నట్లు చెగువీరా సిద్దాంతాలను వల్లెవస్తు, అధికార టీడీపీకి మిత్రపక్షంగా మారాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కమ్యునిజం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతి పార్టీ ఓట్ల రూపంలో వూర్చుకోవటానికి చేస్తున్న ఎత్తుగడల గురించి మాట్లాడుకోవటానికే. ప్రస్తుతం ఉన్న పార్టీలపై ప్రజలల్లో విశ్వాసం లేకపోవచ్చు కాని సామాన్య ప్రజల్లో కమ్యునిజంపట్ల చెక్కుచెదరని విశ్వాసం ఉంది.ఆ విశ్వాసమే దండకారణ్యంలో అగ్గిరాజేస్తుంది. పలు రాష్ట్రాల్లో కార్మికులకు , కర్షకుల పోరాటాలకు దిక్సూచీగా మారింది.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి