Translate

  • Latest News

    22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

    సంచలనం రేకెత్తిస్తున్న కమల్ కేజ్రీవాల్ భేటీ


    దాదాపు రెండు దశాబ్దాల కిందట అవినీతి ప్రధానాంశంగా డైరెక్టర్ శంకర్ నిర్దేశకత్వంలో వచ్చిన భారతీ యుడు సినిమాలో ముసలి పాత్రలో కమల్ హసన్ నటన నభూతో నభవిష్యత్ ఆ పాత్రకు కమల్ త ప్ప మరెవరినీ ఊహించుకోలేమన్నంతగా పండించారు. ఆ తర్వాత శంకర్ అవినీతిపైనే ఎక్కుపెట్టి మ రికొన్ని సినిమాలు మరికొందరు హీరోలతో తీశారు. నటన సంగతి అలా ఉంచితే వ్యక్తిగతంగా కమ్యూ నిజం భావజాలం కలిగి, కుల, మతాలకతీతంగా హేతువాద దృక్పధం కలిగిన కమల్ హసన్ అనూహ్యం గా గా తమిళనాట రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పడమే కాక, అధికార పార్టీ అవినీతి రాజకీయాలపైనే నా పోరాటం అని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాదు వారానికో ప్రత్యక్ష కార్యాచరణతో తమిళ రాజకీయాల్లో దూకుడుగా సాగిపోతున్నారు. ఆ మధ్య కేరళ సీఎం విజయన్ ను  కలసివచ్చి ఆయన  సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రవాల్ ను గు రువారం మధ్యాహ్నం తమిళనాడు వచ్చి కమల్ హసన్ ను  కలవడం దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామానికి దారితీసింది. దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిన పరిస్థితి లో బీజేపీకి సమీప కాలంలో సరితూగే ప్రత్యర్టే కనుచూపుమేరలో కనపడని దశలో ఢిల్లీ రాష్ట్రంలో ఆ ప్ పేరిట పార్టీ పెట్టి అవినీతిపై పోరాటం అంటూ అరవింద్ కేజీ వాల్ ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో ఎను సంచలనం సృష్టించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నాడు.  తర్వాత కొన్ని ఒ  డుదొడుకులు ఎదురైనప్పటికీ తట్టుకొని  నిలబడ్డాడు. అప్ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచన ఉన్న కేజ్రీ వాల్ కు దాదాపుగా అవే భావాలతో ఉన్న కమల్ తురుపుముక్కలా కనపడ్డాడు. కమల్ తో  దోస్తీ  చేసి తమిళనాట ఆప్ కాలుమోపాలని ఆయన యత్నం. ఇద్దరి పోరాటం అవినీతి, మతతత్వంపైనే కాబట్టి ఇద్దరి ఆలోచనలు ఒకటయ్యాయి. కమల్ హసన్ సద్ర్బాహ్మణ కుటుంబంలో పుట్టినా ఆయన తండ్రి ఉన్నతమైన భావాలు కలిగిన స్వాతంత్ర్య సమరయోధుడు. తన ముస్లిం స్నేహితుడి జ్ఞాపకంగా తన కుమారులకు పేర్ల చివర హసన్ అని పెటుకున్నాడు. (చారు హసన్, చంద్ర హసన్, కమల హ సన్). తండ్రి నుంచి ఉన్నత, ఆదర్శ భావాలు పుణికి పుచ్చుకున్న కమల్ రాజకీయాల్లోకి రావాలని  అభ్యు దయ వాదులు అందరూ కోరుకుంటున్నారు. కుళ్లి కంపు కొడుతున్న రాజకీయాలను ప్రక్షాళన చేసి సుగంధ పరిమళాలు అద్దాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

                                                                                                       -మానవేంద్ర


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సంచలనం రేకెత్తిస్తున్న కమల్ కేజ్రీవాల్ భేటీ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top