Translate

  • Latest News

    28, సెప్టెంబర్ 2017, గురువారం

    సినిమా హిట్టా ...ఫట్టా సినిమా రివ్యూలు నిర్ణయిస్తాయా... ? జూనియర్ ఎన్టీఆర్ వాఖ్యల తో మొదలైన రచ్చ


    సినిమా మంచిచెడులు, హిట్టా పట్టా అనేవి సినిమా రివ్యూలు నిర్ణయిస్తాయా..? సినిమా రివ్యూలు చూసి ఎంతమంది సినిమా చూస్తారు....  సినిమా చూడటం మానివేస్తారు.   అన్నదే నేటి ప్రశ్న ఇప్పడు సినిమా రివ్యూలపై ఎడతెరగని చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా  వచ్చిన తరువాత సగటు ప్రక్షకుడే సినిమా విశ్లేషకుడుగా మారిపోయాడు. సోషల్ మీడియా నియంత్రణ ఎలాగు తమ చెప్పూ చేతుల్లో ఉండదు. మంచికాని చెడుకాని అతివేగంగా వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఈ దశలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వాఖ్యలు సినిమా విశ్లేషణపై చర్చకు దారితీసాయి.
    ఎన్టీఆర్ వాఖ్యలతో మొదలైన రచ్చ.
    . సమ్మర్ లో విడుదలైన ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా సందర్భంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినీ విశ్లేషకులపై ఓ రేంజ్ లో ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజులు కూడా అంతే స్థాయిలో ‘రివ్యూ’లపై ఫైర్ అయ్యారు. ఈ సినిమా తర్వాత పెద్ద సినిమాగా విడుదలైన ‘జై లవకుశ’ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా సినీ విశ్లేషకులపై సున్నితమైన విమర్శలు చేసారు. ‘ఎమెర్జెన్సీ ఉన్న పేషెంట్ – డాక్టర్ – దారిన పోయే దానయ్య’ అంటూ సుదీర్ఘంగా ఉదహరించిన జూనియర్ ఎన్టీఆర్, తమ సినిమా ఎమెర్జెన్సీలో ఉన్న పేషెంట్ లాంటిదని, డాక్టర్లుగా భావించే ప్రేక్షకులు చెప్పే ముందు, ఎవరో దారిన పోయే దానయ్య మాదిరి కొంతమంది సినీ విశ్లేషకులు సినిమాలను చంపేయాలని ప్రయత్నిస్తున్నారని, ఇది మా ఒక్క సినిమాకు మాత్రమే జరగలేదని, అన్ని సినిమాలకు జరుగుతోందని, డాక్టర్లు భావించే తమ ప్రేక్షకులు చెప్పే వరకు ఆగండి… అంటూ సునిశితంగా వ్యాఖ్యానించారు.ఈ తరుణంలోనే ప్రిన్స్ మహేష్ బాబు ఇదే ‘రివ్యూ’లపై సింపుల్ గా తేల్చేయడంతో… ఇది మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.‘బిగ్ బాస్’ షో తర్వాత సెలబ్రిటీగా మారిపోయిన మహేష్ కత్తి గ‌త ఏడాది ‘బిచ్చ‌గాడు’ అనే సినిమా వ‌చ్చింద‌ని, ఆ సినిమాపై ఒక్క‌రు కూడా రివ్యూలు రాయ‌లేద‌ని, ఆ సినిమా సూప‌ర్ హిట్ అయింద‌ని గుర్తు చేశారు. చిన్న సినిమాలుగా విడుదలైన ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ సినిమాలపై కూడా రివ్యూలు బాగానే రాశార‌ని అన్నారు. సినిమాను బ‌ట్టి రివ్యూ ఉంటుంది కానీ, సినిమాల‌పై క‌క్షతో రివ్యూలు రాస్తామా? అభ‌ద్ర‌తా భావంతోనే త‌మ‌పై కొంద‌రు సినీ వర్గాల వారు ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, తాము కూడా ప్రేక్ష‌కుల లాంటి వారిమేన‌ని, కాక‌పోతే సినిమాల‌ను విశ్లేషించ‌గ‌ల‌మ‌ని, సినిమాను అమితంగా ప్రేమించాం కాబ‌ట్టే తాము విశ్లేష‌కులమ‌య్యామ‌ని, తమ బాధ్యత అక్కడ వరకే పరిమితమైందని చెప్పుకొచ్చారు
    గత సినిమాల విజయానికి కారణం ఏమిటి..?
     గతంలో సినిమా అంటే వినోదం, ఒక సందేశం. సినిమాలో విడదలైనప్పడు మౌత్ పబ్లిసిటితోనే సినిమాల విజయాలు అధారపడి ఉండేవి. కథ, కథనం, సంభాషణలు, నటన, పాటలు, నేపథ్య సంగీతం, సంభాషణలు తదితర అంశాల అధారంగా నాడు ఉన్న కొన్ని పత్రికల్లో రివ్యూలు వచ్చేవి. సినిమా రంగానికి సంబంధించి పూర్తి పరిజ్ఞానం ఉన్నవారే రివ్యూలు వ్రాసేవారు. అక్షరజ్ఞానం తక్కువగా ఉండటం,  పత్రికలు అందరికి అందుబాటులో లేకపోవటం వలన ఇవి కొంతమందికే పరిమితమయ్యేవి. అత్యధిక సినిమాల విజయానికి మౌత్ పబ్లిసిటే కారణమయ్యేవి. సినిమా బాగుండంటే చాలు ఎద్దుల బండ్లు వేసుకొని వచ్చి కుటుంబ సమేతంగా సినిమాను చూసేవారు. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే అపజయానికి కారణాలు విశ్లేషించుకొనేవారు. సినిమాలలో పనిచేసిన అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది సినిమా అపజయానికి కారణాలను అన్వేషించేవారు. మరో సినిమా నిర్మాణంలో వారు ఎంతటి వారైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేసేవారు. మరోవిజయవంతమైన సినిమాను అందించేవారు.
     ఇప్పడేం జరుగుతుంది..?
     ప్రస్తుతం సినిమా అతి పెద్ద వినోద పరిశ్రమ. పోటీ పెరిగిపోయింది. అవునన్నా కాదన్న ఈ రంగంలో కులం కార్డు ,పెద్ద హీరోల వారసులదే ఆధిపత్యం. నటన, కథ అప్రస్తుత అంశాలుగా మా రిపోయాయి. అత్యధిక సినిమాలు రోటిన్ కథనంలో కొన్ని అంశాలను జోడించి ప్రేక్షకులపై వదులుతున్నారు. సెక్స్,వయలెన్స్  అద్భుతాలు చేయగల హీరోయిజం ప్రస్తుత సినిమాకు మానరిజంగా మారిపోయింది. కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమా తీసే నిర్మాత, సినీనటులకు విమర్శకులు పంటికింది రాయిలా మారారు. అయితే ఇక్కడ ఒక్క విషయం ప్రస్తావించాలి. కొంతమంది విమర్శలు మాత్రం కొంతమంది వ్యక్తులను టార్గెట్గా పెట్టుకొని సినిమా రివ్యూలు ఇస్తున్నారని విమర్శలు కూడా లేకపోలేదు. 
    రివ్యూలతో సినిమా విజయం ఆగిపోతుందా ..?
      ఏ సినిమా విజయానైనా రివ్యూలు నిర్దేశిస్తానటం అవివేకమే అవుతుంది. ఎటువంటి ప్రచారం, రివ్యూ లు  లేని చిన్న బడ్జెట్ సినిమా భారీవిజయాన్ని చవిచూసాయి. పెయిడ్ అర్థికల్ ల రూపం లో అపజయాన్ని మూట గట్టుకొన్న  సినిమాను అత్యధిక రేటింగ్ ఇచ్చి నిలబెట్టాలను కున్నా అది మూడు నాళ్ల ముచ్చటే అవుతుంది. సినిమా విజయాన్ని  రివ్యూలు నిర్దేశించ లేవన్నది  కాదనలేని నిజం. వ్యక్తులను,పార్టీలను,కులాలను టార్గెట్ చేసి రాసే రివ్యూలు,వాటి తాలుకు వెబ్ సైట్ల జనాదరణ పొందలేవు. చివరగా ఒక్క అంశం చిన్న వస్తువును కొనాలన్నా పది మంది అభిప్రాయం తీసుకుంటాం. ఆన్లైన్లో రైటింగ్ చూసుకుంటాం. పెరిగిన టికెట్టు ధరలు సామాన్యులకు వినోదం దూరం చేసేలా మారిన తరుణంలో సినిమా గురించి వివిధ సినిమా రివ్యూలను చూసికోవటం తప్పకాదు. రివ్యూలు రాయటం తప్పకాదు. ఇక్కడ అంతిమంగా ప్రేక్షకుడే న్యాయనిర్దేత. 

                                                                                            - మానవేంద్ర






      
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సినిమా హిట్టా ...ఫట్టా సినిమా రివ్యూలు నిర్ణయిస్తాయా... ? జూనియర్ ఎన్టీఆర్ వాఖ్యల తో మొదలైన రచ్చ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top