Translate

  • Latest News

    28, సెప్టెంబర్ 2017, గురువారం

    మీడియా మిత్రులు ఒక్క క్షణం ఆలోచించండి....నిందితులు చేసింది తప్పే .... మీరు చేస్తారా.?



     నిజమే తప్ప జరిగింది. ఊరకుక్కల్లా యువతిపై దారుణానికి వడిగట్టారు. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ ప్రేమికుడి పేరు కార్తీక్‌. బాధిత యువ‌తి క‌నిగిరిలో డిగ్రీ చ‌దువుతోంది. కార్తీక్‌ అనే యువకుడిని ఆమె ప్రేమిస్తోంది. కొద్దిరోజులుగా ఆమెపై అనుమానం పెంచుకున్నాడు కార్తీక్‌. ఆ అనుమానం కాస్త పెనుభూత‌మైంది.ఆమె ఇంకెవ‌రినో ప్రేమిస్తోంద‌నే అనుమానం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బాధిత యువ‌తిని చాలార‌కాలుగా వేధింపులకు గురి చేశాడు. అత‌ని పైశాచిక‌త్వం ప‌రాకాష్ట‌కు చేరింది. కనిగిరి శివార్లకు ర‌మ్మ‌ని బాధిత యువ‌తికి ఫోన్ చేశాడు. ఒక్క‌డినే ఉన్నాన‌ని, త‌న‌ను క‌లుసుకోవాల‌ని చెప్పాడు. అత‌ని ఉద్దేశం తెలియ‌ని బాధిత యువ‌తికి అత‌ను చెప్పిన ప్ర‌దేశానికి వెళ్లింది.అప్ప‌టికే కార్తీక్‌.. త‌న స్నేహితులు సాయి, కోటేశ్వ‌ర‌రావు, ప‌వ‌న్‌ల‌తో అక్క‌డ కాపుగాశాడు. ఆ యువ‌తికి చేరుకోగానే అస‌భ్యంగా మాట్లాడాడు. దీనితో ఆమె వెళ్లిపోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. ప‌ట్టుకున్నారు. అమ్మాయిపైకి సాయి అనే స్నేహితుడు అత్యాచారం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. సాయి కీచక చర్యకు పాల్పడుతుండగా.. కార్తీక్‌, అతని స్నేహితులు తమ సెల్‌ఫోన్‌లో ఆ ఘాతుకాన్ని చిత్రీక‌రించారు.. అక్క‌డితో ఆగలేదు. దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. షేర్ చేశారు.  బయట ప్రపంచం అంటే ఆ ఊరు లేదా .. పక్కన ఉన్న పరిసర ప్రాంతాలకే ఈ వీడియో పరిమితం . 

     సభ్యసమాజం తలదించుకోవల్సిన సంఘటనే. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన సంఘటనపై మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. దోషులను పట్టుకోవాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇక్కడే ఒక్క విషయాన్ని మనం మరచిపోతున్నాం. ఒక యువతిపై లైంగిక దాడికి యత్నించిన సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు.వారు చేసింది తప్పే. మన మీడియా ఏం చేసింది.ఈ సంఘటన విడియోలను ఈ సంఘటనలో యువతి తాలుకు మొహం ఒక్కటే కనిపించకుండా పదే పదే ప్రసారం చేసింది. ఆ యువతి వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి మరీ శల్యపరీక్ష చేసింది. ఇదే అదనునుగా కొంతమంది ఈ సంఘటన తాలుకు విడీయోలను తమ వైబ్సైట్లలో, యూట్యూబ్లలో అప్లోడ్ చేసి పనిలో పనిగా తమ రేటింగులను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పడు పనిచేసినవారు బిడీయోను షేర్ చేసి ఒక తప్ప చేస్తే మీడియా, సోషల్ మీడియాలలో ప్రసారం చేసిన వారిది తప్ప కాదా ఆమె వ్యక్తిగత జీవితంలో తొంగి చూడటం ఏ విధమైన జర్నలిజం .
    బ్రిటన్ రాజవంశపు యువరాణి డయానా విషాదమరణానికి మీడియానే కారణం. సహచరుడుతో కలసి వెళ్తున్న క్రమంలో మీడియా వెంటపడితే తప్పించుకొనే ప్రయత్నంలో కారు యాక్సిడెంట్లో అశవులు బాసిన విషయం తెలిసిందే. అప్పట్లో అది మీడియా పరిధులు ,లక్షణరేఖపై చర్చకు దారితీసింది. మరెన్నో ఉదంతాలు మీడియా తీరుపై అసహనానికి దారితీస్తున్నాయి.

     పెరిగిన పోటీ తత్వం, రేటింగుల వ్యవహారం, పై బాస్ల అదేశాలు , ఒక్కటేమిటి ఇవన్ని సగటు జర్నలిస్తును వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసేలా చేస్తున్నాయి. విషాదం మేమిటంటే ఇటువంటి సంఘటలో ఉన్న బాధితులు తిరిగి సాదారణ జీవితం గడిపే పరిస్థితి ఉంటుందా.. ? అన్నదే ప్రశ్న ఇటువంటి సంఘటనలు జరిగినప్పడు ప్రసార, ప్రచురణ సమయంలో తీసుకొనే తీసుకోవల్సిన జాగ్రత్తలపై  ఎన్నో మార్గదర్శకాలు ఉన్నా అవి కాగితాలకే పరిమితమౌతున్నాయి. ఇటువంటి బాధితుల కథనాలు ప్రసారం, ప్రచురణ చేసే క్రమంలో మీడియా మిత్రులు ఒక్క నిమిషం అలోచించి, విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది.

                                                                                                                                                          -                                                                                                                                                                                                           -మానవేంద్ర 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మీడియా మిత్రులు ఒక్క క్షణం ఆలోచించండి....నిందితులు చేసింది తప్పే .... మీరు చేస్తారా.? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top