ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం టీడీపీ నాయకుల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అధినేత చంద్రబాబు సైతం ఇదే ధోరణి లో ఉండటం తో పార్టీ క్యాడర్ సైతం 2019 ఎన్నికలో విజయం నల్లేరు పై నడక అన్న విధంగా ఉంటుందని కలల లో మునిగి పోతున్నారు. రొండు ఎన్నికల ఫలితాల ను ప్రాతిపదిక న రానున్న ఎన్నికల ను బేరీజు వేయవచ్చా... నిజంగానే అధికార టీడీపీ కి ప్రజల నుంచి అంతటి మద్దతు ఉందా .. ఒక సారి పరిశీలించు కుంటే ...
2014 లో జరిగిన సాధారణ ఎన్నికలకు , ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఓట్ల శాతం పోల్చి చూస్తే టీడీపీ కి జనాధరణ పెరిగిందని ఆ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ సై అంటోంది. 2014 ఎన్నికల్లో టిడిపికి, వైసీపికి వచ్చిన ఓట్లలో సుమారు ఐదులక్షల ఓట్ల తేడా ఉంది. వైసీపీ కంటే టిడిపికి ఐదు లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి.అయితే 2014 ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతంతో నగర పంచాయితీల్లో వచ్చిన ఓటింగ్ శాతంతో పోల్చి చూస్తే టిడిపి ఓటింగ్ శాతం పెరిగింది.అదే సమయంలో వైసీపికి 13 శాతం ఓట్లు తగ్గాయని టిడిపి విశ్లేషణలో తేలింది మైనార్టీలు, బడుగు, బలహీనవర్గాలు నివసించే ప్రాంతాల్లో టిడిపికి ఓట్లు పెరిగాయని ఆ పార్టీ భావిస్తోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే టిడిపికి 16.30 శాతం ఓట్లు పెరిగాయని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది.ఈ లెక్కల ఆధారంగానే ముందస్తు ఎన్నికలకు టిడిపి సై అంటోంది. ఈ ధైర్యంతోనే ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ సన్నద్దమౌతోంది. ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ క్యాడర్ కు దిశా, నిర్దేశం చేసారు.
పార్టీ ఎమ్మెల్యే ల పై అవినీతి ఆరోపణలు ...
పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యే ల తో పాటు మంత్రుల పై సైతం అనేక అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి . సీఎం చంద్రబాబు సొంత దర్యాప్తు సంస్థల చేత వివిధ నియోజక వర్గాల లో ఎమ్మెలే , మంత్రుల పనితీరు , అవినీతి పై విచారణ జరిపినప్పుడు అనేక మంది పనితీరు బాగా లేదని స్పష్టమైంది . మరో వైపు వైకాపా నుంచి వచ్చిన వారితో ప్రతిరోజూ వివాదాలు చెలరేగి పార్టీ ప్రతిష్టకు సంకటం గా మారిన విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితులో రొండు ఎన్నికల్లో గెలుపును తీసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తారా అన్నదే ప్రశ్న . 2004 లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టిడిపి చేతులు కాల్చుకొంది. కానీ, ఆనాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా ఉందని ఆపార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఆ:ద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు 2004 అసెంబ్లీ ఎన్నికలను నిర్ణీత సమయానికి కంటే ముందుగానే ఎన్నికలకువెళ్ళాడు. నక్సల్ దాడి నుండి చంద్రబాబునాయుడు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు. అయితే ఈ ఘటనవల్ల సానుభూతి పవనాలు కలిసివచ్చే అవకాశం ఉందని ఆనాడు టిడిపి భావించింది.అంతేకాదు కేంద్రంలోని ఎన్ డి ఏ ను కూడ ముందస్తుకు ఒప్పించారు బాబు. దీంతో కేంద్రంలో ఎన్ డి ఏ, రాష్ట్రంలో టిడిపి 2004 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అయితే ప్రస్తుతం దేశంలో , రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి.ఈ నేపథ్యంలో మరోసారి ముందస్తు ఎన్నికలకు టిడిపి సన్నద్దమౌతోంది.ముందస్తు ఎన్నికల వల్ల తమకు ప్రయోజనం కలుగుతోందని ఆ పార్టీ భావిస్తోంది.2014లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకొనే ఎన్నికలు. రాష్ట్రం విడిపోయినందున కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎన్నికైతే రాష్ట్రం బాగుంటుందని ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. గత చరిత్రను దృష్టిలో ఉంచుకోవాల్సిన పరిస్థితులు గుర్తుకు తెచ్చుకోవాలని పార్టీ లోని సీనియర్లు హెచ్చ రిస్తున్నారు. -- శ్రీహర్ష
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి